IT Raids Malla Reddy : మంత్రికి షాక్ బంధువు ఇంట్లో నగదు సీజ్
ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో సోదాలు
IT Raids Malla Reddy : కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మాటల యుద్దానికి తెర తీశారు. ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కాం బయటకు వచ్చింది. సీఎం కేసీఆర్ పీఎంను డైరెక్ట్ అటాక్ చేశారు. దీంతో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేశారంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇది పక్కన పెడితే మల్లారెడ్డి మామూలోడు కాదని తేలి పోయింది. లెక్కకు మించిన కోట్లు వెనకేసుకున్నట్లు సోదాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఓ వైపు ఉద్యోగాలు లేక నానా తంటాలు పడుతుంటే , యూనివర్శిటీలలో వసతి సౌకర్యాలు లేక తల్లడిల్లుతుంటే మంత్రికి ఓ యూనివర్శిటీ తో పాటు కాలేజీలు, రియల్ ఎస్టేట్ దందాలు, ఆపై హాస్పిటల్స్ . ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
ఇవాళ అందుకేనేమో ఐటీ నజర్ పెట్టింది. చెప్పా చేయకుండానే తెల్లవారుజామునే ఇంటి ముందు వాలి పోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 బృందాలు వాళ్లతో పాటు కేంద్ర భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి(IT Raids Malla Reddy) చెందిన తనయులు, కూతురు, అల్లుళ్లు, సమీప బంధువుల ఇళ్లను , కాలేజీలను, కార్యాలయాలలో సోదాలు చేపట్టారు.
ప్రస్తుతం మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయడంలో మిగతా మంత్రులలో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : కల్లు గీత కార్మికుల గోస పట్టని కేసీఆర్