DDC LG ROW : లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ అధికారాల‌పై ఆరా

త‌న తొల‌గింపు అక్ర‌మం అంటూ దావా

DDC LG ROW : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆప్ స‌ర్కార్ కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనాకు మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌డుతున్నారు. ఆపై విచార‌ణ‌కు ఆదేశిస్తున్నారు. ఈ త‌రుణంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

కేబినెట్ హోదా క‌లిగిన ఢిల్లీ డైలాగ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ క‌మిష‌న్ (డీడీసీ) ఉపాధ్య‌క్షుడిగా ఉన్న జాస్మిన్ షా(DDC LG ROW) ను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న రాజ‌కీయాల‌కు వేదిక‌గా మార్చేశార‌ని, ఆఫీసు పూర్తిగా ప‌ని చేయ‌డం లేద‌ని, ఆయ‌న‌కు ప్ర‌భుత్వ ప‌రంగా క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేర‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం అధికారికంగా ఉత్త‌ర్వులు వెల్ల‌డించింది. దీనిని స‌వాల్ చేస్తూ డీడీసీ చైర్ ప‌ర్స‌న్ జాస్మిన్ షా కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కు తొగించే అధికారం లేనే లేద‌ని స్ప‌ష్టం చేశారు ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది ఇవాళ కోర్టులో.

ప్ర‌జాస్వామ‌బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వానికి నాయ‌కుడిగా ఉన్న సీఎం నియ‌మించిన వ్య‌క్తిని లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ ఏ ప్రాతిప‌దిక‌న తొల‌గిస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు జాస్మిన్ షా. ప్ర‌స్తుతం ఆయ‌న తొల‌గింపుపై కోర్టు కూడా ఆరా తీసింది. ఎవ‌రికి ఎలాంటి ప‌రిమితులు ఉన్నాయో తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం కేంద్రం , లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, ఆప్ స‌ర్కార్ మ‌ధ్య ఢిల్లీ మూడు ముక్క‌లాట‌గా మారి పోయింది. ఇప్ప‌టికే కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ అధికారాల‌పై కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.

Also Read : డ్ర‌గ్స్ ఇచ్చారు సోనాలీ ఫోగ‌ట్ ను చంపేశారు

Leave A Reply

Your Email Id will not be published!