IT Raids Malla Reddy : రెండో రోజూ ‘మల్లారెడ్డి’కి ఐటీ షాక్
తనయుడికి స్వల్ప అస్వస్థత..కోట్లు నగదు సీజ్
IT Raids Malla Reddy : తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి భారీ ఎత్తున షాక్ తగిలింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఐటీ దాడులు(IT Raids Malla Reddy) బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 50 బృందాలు ఈ సోదాల్లో పాలు పంచుకున్నాయి. మంత్రికి చెందిన నివాసాలు, కుటుంబీకులు, బంధువుల ఇళ్లల్లో దాడులు చేపట్టాయి.
ఐటీ అధికారులు టీమ్ లుగా విడి పోయి సోదాలు కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కంటిన్యూగా నడుస్తున్నాయి. రూ. 5 కోట్ల నగదు , కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది ఐటీ. ఇదిలా ఉండగా ఇవాళ తెల్లవారుజాము నుంచి ఐటీ జల్లెడ పడుతోంది. మరో వైపు దాడుల దెబ్బకు మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఛాతిలో నొప్పి సడన్ గా రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా కొడుకు ను చూసేందుకు బయలు దేరిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు నిలిపి వేశారు. తాను వెళ్లి పలకరించి తిరిగి వస్తానని చెప్పినా ఒప్పు కోలేదు. దీంతో ఐటీ ఆఫీసర్లపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. 200 మందిని పంపించి దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు మల్లారెడ్డి. రాత్రంతా తన కుమారుడిని కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు మల్లారెడ్డి తో పాటు కొడుకులు, కూతురు, అల్లుళ్లు, సహచరులు, బంధువుల ఇళ్లు, ఆఫీసులు, యూనివర్శిటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, రియల్ ఎస్టేట్ ఆఫీసులను జల్లెడ పట్టారు ఐటీ అధికారులు.
Also Read : ఐటీ దాడులు కళ్లు చెదిరే నోట్ల కట్టలు