Supreme Court : టీఎన్ శేష‌న్ లాంటి అధికారి కావాలి – సుప్రీం

నిప్పులు చెరిగిన ధ‌ర్మాస‌నం

Supreme Court : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. గ‌తి త‌ప్పిన కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలోనే అత్యంత గొప్ప‌నైన ప్ర‌జాస్వామ్యం క‌లిగిన స‌మ‌న్న‌త భారతానికి కీల‌క‌మైన సంస్థ కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

ఈ సంద‌ర్భంగా మాజీ కేంద్ర ఎన్నిక‌ల అధికారి, దివంగ‌త టీఎన్ శేష‌న్ ను ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. 1990 నుండి 1996 వ‌ర‌కు పోల్ ప్యాన‌ల్ చీఫ్ గా కీల‌క ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చిన టీఎన్ శేష‌న్ లాంటి ఉన్న‌త, నిబ‌ద్ద‌త క‌లిగిన అధికారి ప్ర‌స్తుతం సిఇసీగా కావాల‌ని స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌క వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల కోసం దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది. దేశంలో భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పాత్ర అత్యంత కీల‌క‌మని ఆ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించాల‌ని సూచించింది.

ఒక ర‌కంగా న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు కోలుకోలేని దెబ్బ‌. ఈ సంద‌ర్భంగా సీరియ‌స్ కామెంట్స్ చేసింది ధ‌ర్మాస‌నం. పెళుసుగా ఉండే భుజంపై భార‌త రాజ్యాంగం అపార‌మైన అధికారాల‌ను క‌లిగి ఉంద‌ని పేర్కొంది. బ‌ల‌మైన వ్య‌క్తిని సిఇసీ ప‌ద‌విలో నియ‌మించ‌డం చాలా ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌క వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తేవాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ పై జ‌స్టిస్ కేఎం ఓసెఫ్ నేతృత్వంలోని న్యాయ‌మూర్తులు అజ‌య్ ర‌స్తోగి, అనిరుద్ద బోస్ , హృషి కేశ్ రాయ్ , సిటి ర‌వి కుమార్ ల‌తో కూడిన రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ధ‌ర్మాస‌నం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : శ‌శి థ‌రూర్ కేర‌ళ‌ టూర్ లో క‌ల‌కలం

Leave A Reply

Your Email Id will not be published!