Malla Reddy : ఇంజనీర్లు..డాక్టర్లను అందిస్తున్నా – మల్లారెడ్డి
నా కొడుకును కొట్టిండ్రు నన్ను ఏమీ అనలేదు
Malla Reddy : తెలంగాణలో విద్యా సంస్థలతో సమాజ సేవ చేస్తున్నానని తాను ఎవరినీ మోసం చేయలేదంటూ చిలుక పలుకులు పలికారు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.
ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెల్లవారుజాము నుంచి మంత్రితో పాటు కొడుకులు, కూతురు, అల్లుళ్లు, సోదరులు, వ్యాపార భాగస్వాములు, కుటుంబీకులు, సన్నిహితుల ఇళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఫామ్ హౌస్ లు , ఇంటర్నేషనల్ స్కూళ్లు, క్రాంతి బ్యాంకు, రియల్ ఎస్టేట్ ఆఫీసులలో ఏక మొత్తంలో దాడులు చేపట్టింది.
ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మల్లారెడ్డికి(Malla Reddy) చెందిన ప్రతి దానిని పరిగణలోకి తీసుకుని జల్లెడ పట్టారు. ఏకంగా 50 బృందాలుగా ఏర్పడి మొత్తం 200 మంది సోదాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం కూడా దాడులు కంటిన్యూగా చేస్తున్నారు.
ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లతో పాటు ఏకంగా ఐదు కోట్ల నగదును సీజ్ చేశారు. ఇదిలా ఉండగా మల్లారెడ్డి పెద్ద కొడుకు సుదర్శన్ రెడ్డికి ఛాతి నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తనయుడిని చూసేందుకు బయలు దేరేందుకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మల్లారెడ్డి. ఐటీ దాడులు జరుగుతున్న తీరుపై మండిపడ్డారు. ఐటీ ఆఫీసర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తన కొడుకును రాత్రంతా కొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దొంగతనం చేయలేదని డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను సమాజానికి అందిస్తున్నానని అన్నారు మల్లారెడ్డి.
Also Read : రెండో రోజూ ‘మల్లారెడ్డి’కి ఐటీ షాక్