Jairam Ramesh : సావర్కర్ కథ ముగిసిన అధ్యాయం – జైరాం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకింగ్ కామెంట్స్
Jairam Ramesh : భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కథ ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇంఛార్జి జైరాం రమేష్(Jairam Ramesh) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా హిందూత్వ సిద్దాంతకర్తపై ఎంపీ చేసిన దాడులు తమ కూటమిపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందంటూ శిసవేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చ గొట్టడం మంచి పద్దతి కాదని సూచించారు.
ఇదే సమయంలో మహా వికాస్ అఘాడీ లో అనుమానం రేకెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీని సంజయ్ రౌత్.
ఇదిలా ఉండగా శివసేన అనుమానం వ్యక్తం చేయడంపై తీవ్రంగా స్పందించారు జైరాం రమేష్(Jairam Ramesh). సావర్కర్ కథ ముగిసిన అధ్యాయమని, దాని గురించి అధికంగా చర్చించాల్సిన అవసరం లేదన్నారు. తాము ఇంతటితో క్లోజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరో వైపు మహాత్మా గాంధీ మనుమడు తుషార్ గాంధీ సావర్కర్ పై సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
ఇక ఇంతటితో ఈ చర్చకు ముగింపు పలికితే బెటర్ అని సూచించారు జైరాం రమేష్.
Also Read : ఓటర్ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి – దీదీ