TS High Court Order : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు 30కి వాయిదా
బీఎల్ సంతోష్ కు ఈమెయిల్ ద్వారా నోటీసు
TS High Court Order : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది తెలంగాణలోని మోయినాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఈ కేసులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్ కు సంబంధం ఉందంటూ నోటీసులు జారీ చేసింది. ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో విచారణకు హాజరు కాలేక పోతున్నట్లు పేర్కొన్నారు.
దీనిని రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో కీలక మంత్రిగా ఉన్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకు భారీ ఎత్తున నగదు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ ఆఫీసర్లు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందితో 50 బృందాలుగా ఏర్పడి దాడులు కొనసాగిస్తున్నారు.
ఈ తరుణంలో ఎమ్మెల్యేల కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బుధవారం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ హాజరు కాక పోవడం గురించి ప్రధానంగా వాదోపవాదాలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరోసారి బీఎల్ సంతోష్ కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా నోటీసులు అందించాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును నవంబర్ 30కి వాయిదా(TS High Court Order) వేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా ఈ వ్యవహారం ఎంత దాకా వెళుతుందనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read : కొలువులు కష్టం పెళ్లి చేసుకోవడం ఉత్తమం