Raghunandan Rao : తప్పు చేయని మల్లారెడ్డికి భయం ఎందుకు
సెల్ ఫోన్ దాచాలాల్సిన అవసరం ఏమొచ్చింది
Raghunandan Rao : బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు దాడులు చేయడాన్ని స్వాగతించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవన్నారు. వాళ్లకు వచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు చేపడుతున్నారని చెప్పారు.
ఇదే క్రమంలో చామకూర మల్లారెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పు చేయని మల్లారెడ్డి ఎందుకు సెల్ ఫోన్ ను చెత్త బుట్టలో దాచి పెట్టారంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఏ తప్పు చేయక పోతే ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల్లో కక్ష సాధింపులు ఉండవని స్పష్టం చేశారు.
భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని , ఎందుకు డాక్యుమెంట్లను చింపి వేయాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మల్లారెడ్డి తమపై ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. చట్టం ముందు అంతా సమానులేనన్న విషయం గుర్తించాలన్నారు రఘునందన్ రావు(Raghunandan Rao) .
ఇదిలా ఉండగా ఇటీవల ఎవరికి ఐటీ లేదా దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేసినా వారందరికీ వెంటనే అనారోగ్యం కలుగతుందన్నారు. ఆపై ఆస్పత్రులకు వెళుతున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ నాయకుడు. విచిత్రం ఏమిటంటే టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ఐటీ అధికారులు ఎప్పుడూ దాడులకు పాల్పడరని, కేవలం డాక్యుమెంట్లు మాత్రం పరిశీలిస్తుందని చెప్పారు రఘునందన్ రావు. ఐటీ ఆఫీసర్లు వస్తే సంతోష్ రెడ్డి ఎందుకు తలుపులు మూసుకున్నారంటూ నిలదీశారు.
Also Read : రాముడి పేరుతో రౌడీయిజం సహించం