YS Jagan : ఆధునిక టెక్నాల‌జీతో ఏపీలో భూముల స‌ర్వే

దేశంలో ఎక్క‌డా లేద‌న్న ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

YS Jagan : డైన‌మిక్ లీడ‌ర్ గా పేరొందారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఓ వైపు ప్ర‌తిప‌క్షాలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా, ఆరోప‌ణ‌లు సంధించినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు.

ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ఉపాధి, వ్య‌వ‌సాయం, మ‌హిళా సాధికార‌త‌, టెక్నాల‌జీ ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న చేప‌ట్టిన నాడు నేడు కార్య‌క్ర‌మం దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా మారింది. మ‌రో వైపు వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి రైతు భ‌రోసా కేంద్రాల ప‌నితీరు బాగుందంటూ కేంద్రం పేర్కొన‌డం విశేషం.

తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారుర సీఎం. మీ భూమి మా హామీ అంటూ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు జ‌గ‌న్ రెడ్డి. అత్యంత ఆధునిక సాంకేతిక‌తతో ల్యాండ్ స‌ర్వేను చేప‌డుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం.

దేశంలో వందేళ్ల త‌ర్వాత జ‌రుగుతోంద‌న్నారు. శ్రీ‌కాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో శాశ్వ‌త భూహ‌క్కు, భూ ర‌క్ష ప‌త్రాల పంపిణీని చేప‌ట్టారు. ల‌బ్దిదారుల‌కు ప‌త్రాలు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(YS Jagan) పంపిణీ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల గ్రామాల్లో భూముల రీ స‌ర్వే కార్య‌క్ర‌మం పూర్తి చేశామ‌ని చెప్పారు. స‌ర్వే పూర్త‌యిన వారికి ఈ సంద‌ర్భంగా ప‌త్రాలు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. రీ స‌ర్వే త‌ర్వాత డిజిట‌ల్ రెవెన్యూ రికార్డుల‌ను టాంప‌రింగ్ చేయ‌డం సాధ్యం కాద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా 2023 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ రీ స‌ర్వే చేప‌ట్ట‌డం పూర్త‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : రాముడి పేరుతో రౌడీయిజం స‌హించం

Leave A Reply

Your Email Id will not be published!