Arun Goyal SC : అరుణ్ గోయల్ నియామకం ‘సుప్రీం’ ఆగ్రహం
అప్పుడే వీఆర్ఎస్ అంతలోనే సీఈసీ ఛాన్స్
Arun Goyal SC : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ప్రధానంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ ను నియమించడంపై తీవ్ర ఆగ్రహం(Arun Goyal SC) వ్యక్తం చేసింది. సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రధానమంత్రిని ప్రశ్నించే దమ్మున్న సీఈసీ కావాలని ఎస్ బాస్ అన్న వారు వద్దంటూ పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకత లోపించిందంటూ దాఖలైన పిటిషన్ పై నిన్న విచారించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గురువారం కూడా విచారణ చేపట్టింది.
ఈ సందర్బంగా ఎందుకు అంత తొందరగా అరుణ్ గోయల్ ను నియమించాల్సి వచ్చిందో కేంద్రం సమాధానం చెప్పాలని కోరింది. ఒకే రోజున ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంలో గల ఆంతర్యం ఏమిటో, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని స్పష్టం చేసింది.
ఒక రకంగా నిలదీసింది ధర్మాసనం. షార్ట్ లిస్ట్ చేసిన నలుగురి పేర్ల జాబితా నుండి న్యాయ శాఖ మంత్రి తమను ఎంపిక చేస్తారని కానీ అరుణ్ గోయల్ విషయంలో అలా జరగలేదని అభిప్రాయపడింది. స్వచ్చంధ పదవీ విరమణ వెంటనే ఎలా సీఈసీగా ఎంపిక అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజీవ్ కుమార్ , అనూప్ చంద్ర పాండేతో పాటు అరుణ్ గోయల్ భాగమయ్యారంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. విచిత్రం ఏమిటంటే అరుణ్ గోయల్ గురువారం దాకా ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి అధికారిగా ఉన్నారు. అకస్మాత్తుగా శుక్రవారం వీఆర్ఎస్ ఇచ్చారు. అంతలోపే ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారంటూ పేర్కొన్నారు.
Also Read : కేంద్రానికి షాక్ సీఈసీ ఎంపికపై సుప్రీం గుస్సా