Malla Reddy : కోట్లు అబ‌ద్దం ల‌క్షలు నిజం – మ‌ల్లారెడ్డి

ఐటీ అధికారుల తీరు దారుణ‌మ‌ని ఫైర్

Malla Reddy : ఓ వైపు రూ. 8 కోట్ల‌కు పైగా మంత్రి మల్లారెడ్డికి(Malla Reddy) సంబంధించి ఐటీ దాడుల్లో దొరికాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే అదంతా అబ‌ద్ద‌మంటున్నారు. గురువారం మ‌ల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కావాల‌ని దాడులు చేయిస్తోందంటూ ఆరోపించారు.

తాను ప్ర‌జ‌ల‌కు విద్యా ప‌రంగా సేవ చేస్తున్నాన‌ని చెప్పారు. రోజుకు 1,000 మందికి ఉచితంగా భోజ‌నం, మందులు పంపిణీ చేస్తున్నాన‌ని తెలిపారు. కోట్లు దొరికాయంటూ చేస్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు. కేవ‌లం రూ. 28 ల‌క్ష‌లు మాత్ర‌మే ల‌భించాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక‌నైనా త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆపాలని కోరారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని, బాజాప్తాగా ట్యాక్స్ క‌డ‌తాన‌ని , జీఎస్టీ కూడా క‌ట్టామ‌న్నారు. ప్ర‌తి దానికి లెక్కలు ఉన్నాయ‌ని అన్నారు. కేవ‌లం కేసీఆర్ మీద ఉన్న కోపంతో మాపై దాడుల‌కు దిగ‌డం దారుణ‌మ‌న్నారు.

తాము విచార‌ణ‌కు స‌హ‌క‌రించామ‌ని, కానీ త‌మ కుటుంబీకుల‌ను టార్గెట్ చేస్తూ 100 కోట్లు అక్ర‌మంగా సంపాయించావంటూ సంత‌కాలు పెట్టాల‌ని కోర‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. అందుకే తాను పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు చామ‌కూర మ‌ల్లారెడ్డి(Malla Reddy). త‌న‌కు ఆదాయమే లేద‌ని ఇక ఇన్ కం ట్యాక్సు ఎందుకు క‌ట్టాల‌ని తిరుగు ప్ర‌శ్నించారు.

దాడులు, సోదాలు త‌న‌కు కొత్త కాద‌న్నారు. గ‌తంలో కూడా జ‌రిగాయ‌ని తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని హెచ్చ‌రించారు. కేంద్ర బ‌ల‌గాల‌తో దౌర్జ‌న్యం ఎలా చేస్తారంటూ నిల‌దీశారు మ‌ల్లారెడ్డి. ఐటీ ఆఫీస‌ర్లు న‌మ్మించి మోసం చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

త‌న కొడుకును టార్చ‌ర్ పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : కొలువులు క‌ష్టం పెళ్లి చేసుకోవ‌డం ఉత్త‌మం

Leave A Reply

Your Email Id will not be published!