Asim Munir Pak Army : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా అసీమ్ మునీర్

నియ‌మించిన ప్ర‌ధాన మంత్రి ష‌రీఫ్

Asim Munir Pak Army : పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు దేశానికి సంబంధించిన ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌రల్ స‌య్య‌ద్ అసీమ్ మునీర్ ను ఆర్మీ(Asim Munir Pak Army) చీఫ్ గా నియ‌మించారు. అసీమ్ మునీర్ తో పాటు ఆయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మ‌న్ గా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ సాహిర్ షంసాద్ మీర్జాను ఎంపిక చేశారు.

అసీమ్ మునీర్ గ‌తంలో ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ గా ప‌ని చేశారు. గురువారం పాకిస్తాన్ ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అసీమ్ మునీర్ ను కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఎఎస్)గా నియ‌మించారు. లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అసీమ్ మునీర్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ క‌మ‌ర్ జావెద్ బ‌జ్వా స్థానంలో ఎంపిక‌య్యారు.

జ‌న‌ర‌ల్ క‌మ‌ర్ జావెద్ బ‌జ్వా కు 61 ఏళ్లు. మూడేళ్లు పొడిగించారు ఆయ‌న పోస్టును. న‌వంబ‌ర్ 29న ఆర్మీ చీఫ్ ప‌ద‌వి నుంచి ప‌దవీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. మ‌రో వైపు జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మ‌న్ గా జ‌న‌ర‌ల్ సాహిర్ షంషాద్ మీర్జాను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచార శాఖ మంత్రి మ‌ర్రియం ఔరంగాజేబ్ వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా రెండు నియామ‌కాలు కీల‌కం కానున్నాయి. ఇద్ద‌రి అనుమ‌తి కోసం ఫైళ్ల‌ను రాష్ట్ర‌ప‌తికి పంపించింది ప్ర‌భుత్వం. 75 ఏళ్ల ఉనికిలో స‌గానికి పైగా దేశాన్ని పాలించిన పాకిస్తాన్ సైన్యం భ‌ద్ర‌త‌, విదేశాంగ విధాన విష‌యాల‌లో గ‌ణ‌నీయ‌మైన అధికారాన్ని క‌లిగి ఉంది.

ఈ నియామ‌కాల కోసం ఆర్మీ ఆరుగురు టాప్ లెఫ్టినెంట్ జ‌న‌రల్స్ పేర్ల‌ను పంపింది ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం. అసిమ్ మునీర్ తో పాటు సాహిర్ షంషాద్ మీర్జా, అజ‌ర్ అబ్బాస్ , నౌమాన్ మెహ‌మూద్ , ఫైజ్ హ‌మీద్ , మ‌హ్మ‌ద్ అమీర్ పేర్ల‌ను ప్ర‌తిపాదించింది పాకిస్తాన్ స‌ర్కార్.

Also Read : యుఎస్ వాల్ మార్ట్ లో కాల్పుల మోత

Leave A Reply

Your Email Id will not be published!