Supreme Court : సీఈసీ నియామ‌కం కేంద్రం అత్యుత్సాహం

అరుణ్ గోయ‌ల్ నియామ‌కంపై ధ‌ర్మాస‌నం

Supreme Court : కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా పంజాబ్ కు చెందిన సీనీయ‌ర్ రిటైర్డ్ అధికారి అరుణ్ గోయ‌ల్ ను ఎంపిక చేయ‌డంపై దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ కొన‌సాగుతోంది. సుప్రీంకోర్టులో(Supreme Court) ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ దావా దాఖ‌లు చేశారు. గ‌త రెండు రోజులుగా ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధానంగా కేంద్ర ప్ర‌భుత్వం అత్యుత్సాహం క‌నిపిస్తోందంటూ పేర్కొంది. ఇంత త్వ‌ర‌గా వీఆర్ఎస్ తీసుకున్న అధికారిని ఆ వెంట‌నే సీఈసిగా(CEC) నియ‌మించ‌డం వెనుక గ‌ల కార‌ణం ఏమిటో చెప్పాల‌ని సొలిసిట‌ర్ జన‌ర‌ల్ ను కోరింది.

అరుణ్ గోయ‌ల్ ఎంపిక‌కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన ఫైల్ తో పాటు ఏ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేశార‌నే దానిపై కూడా అఫిడ‌విట్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది ధ‌ర్మాస‌నం. ప్ర‌ధాన‌మంత్రిని కూడా ప్ర‌శ్నించే స్థాయిలో ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో సీఈసీ ఉన్నారా అని ప్ర‌శ్నించింది. ఒక ర‌కంగా కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్టింది. సీఈసీ ఎంపిక‌లో ఎందుకు ఇంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని నిల‌దీసింది. ఇందులో ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని, ఎవ‌రికీ ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలు లేవంటూ పేర్కొన్నారు సీజే.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్. ఆయ‌న కేంద్ర స్థాయిలో కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆ వెంట‌నే వీఆర్ఎస్ తీసుకున్నారు. త‌క్ష‌ణ‌మే సీఈసీగా నియ‌మించ‌బ‌డ్డార‌ని ఇది ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. పూర్తిగా పార‌దర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అంశ‌మ‌ని పేర్కొన్నారు.

దీనిపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం జోక్యం చేసుకుంది. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సీఈసీ నియామ‌కాన్ని అత్యుత్సాహంతో నియ‌మించిన‌ట్లు అర్థం అవుతోందంటూ అభిప్రాయ ప‌డింది.

Also Read : అప్పుడే వీఆర్ఎస్ అంత‌లోనే సీఈసీ ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!