PM Modi : కావాలనే చరిత్రను వక్రీకరించారు – మోదీ
గత పాలకులపై ప్రధానమంత్రి ఆరోపణ
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి గతంలో ఏలిన పాలకులపై ఆరోపించారు. వారి నిర్వాకం వల్లనే దేశ చరిత్రలో కొందరి పేర్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే అసలైన చరిత్ర కనిపించకుండా చేశారంటూ మండిపడ్డారు.
ఘనమైన వారసత్వం, చరిత్రను ఉద్దేశ పూర్వకంగానే వక్రీకరించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి(PM Modi) . ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా మొఘలులను ఓడించిన 17వ శతాబ్దపు అహోం రాజ్యానికి చెందిన జనరల్ లచిత్ బర్పుకాన్ కు నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు విస్తరిస్తున్న పరంపరను అడ్డుకున్న వైనం చరిత్రలో ఎక్కలేదన్నారు ప్రధాని. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇవాళ భారత దేశం వలసవాద సంకెళ్లను తెంచుకుని, మన వారసత్వాన్ని సంబురాలు చేసుకుంటోందన్నారు. ఇదే క్రమంలో దేశం కోసం పాటు పడిన వాళ్లు, ప్రాణాలను పణంగా పెట్టిన వాళ్లను గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు.
ఇదే సమయంలో మన వీరులను గర్వంగా స్మరించు కోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైవిధ్యమైన వారసత్వాన్ని జరుపు కోవడం తనకు గర్వంగా ఉందని చెప్పారు.
భారత దేశం అంటేనే యోధుల చరిత్ర ఉందన్నారు. విజయం, త్యాగం, నిస్వార్థం , ధైర్య సాహసాల చరిత్ర, దురాగతాలు చేసే వారికి తగిన సమాధానం చెప్పగల సామర్థ్యం భారత దేశానికి ఉందన్నారు.
ఇదే సమయంలో అస్సాం చరిత్రర భారత దేశ ప్రయాణంలో చాలా గర్వించ దగిన విషయమని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
Also Read : కావాలనే జైన్ వీడియోలు బీజేపీ లీక్