Amazon Layoffs : తీసేయ‌డం లేదు వాళ్లే వెళుతున్నారు

కొంద‌రు త‌మంత‌కు తాముగా వెళ్లి పోయారు

Amazon Layoffs : ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొన‌సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఉద్యోగుల‌కు మంగ‌ళం పాడుతున్నాయి. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ 10 వేల మందికి పైగా తొల‌గించారు కొత్త బాస్ ఎలాన్ మ‌స్క్. ఆ వెంట‌నే ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ 11 వేల మందికి మంగ‌ళం పాడారు.

గూగుల్ సైతం 10 వేల మందికి చెక్ పెట్ట‌నుంది. ఇప్ప‌టికే ఆల్ఫా బెట్ సంస్థ‌లో కొంద‌రిని తొల‌గించే ప‌నిలో ప‌డింది. ఇదే స‌మ‌యంలో ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా , ఇత‌ర రంగాల‌లో సైతం లే ఆఫ్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే మీడియా, వినోద రంగాల‌కు కూడా ఈ జాబ్స్ కోత విధించ‌డం ప్రారంభ‌మైంది.

వాటిలో కూడా 6 వేల మందికి పైగా తొల‌గించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సమ‌యంలో ప్ర‌పంచంలోనే టాప్ ఇకామ‌ర్స్ కంపెనీగా పేరొందిన జెఫ్ బెజోస్ సార‌థ్యంలోని అమెజాన్ లో సైతం ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు(Amazon Layoffs) అమెరికా మీడియా కోడై కూసింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌ముఖ కంపెనీల వ్యాపారం అంతా ఎక్కువ‌గా ఇండియ‌న్ మార్కెట్ పై ఆధార‌ప‌డి కొన‌సాగుతున్న‌వే కావ‌డం విశేషం.

ఇంకో వైపు చైనా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. ఇక భార‌త్ కు సంబంధించి అమెజాన్ లో ఎవ‌రినీ ఇంత వ‌ర‌కు తొల‌గించ లేద‌ని అమెజాన్ సంస్థ ప్ర‌క‌టించింది. భార‌త ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఎందుకు తొల‌గిస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌ద‌రు సంస్థ వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కొంద‌రు వాలంట‌రీగా త‌ప్పుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేసింది.

ఏది ఏమైనా కొలువులు ఉంటాయో ఉండ‌వోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

Also Read : రిప‌బ్లిక్ డేకు అతిథిగా ఈజిప్ట్ ప్రెసిడెంట్

Leave A Reply

Your Email Id will not be published!