Anand Teltumbde : ఎవ‌రీ ఆనంద్ తెల్తుంబ్డే ఏమిటా క‌థ‌

ప్రొఫెస‌ర్..ర‌చ‌యిత‌..ఉద్య‌మ‌కారుడు

Anand Teltumbde : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధానంగా రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. సీజేఐగా ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కొలువు తీరాక సంచ‌ల‌న తీర్పుల‌కు వేదిక‌గా మారింది కోర్టు.

ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ నియామ‌కంపై ధ‌ర్మాస‌నం చేసిన వ్యాఖ్య‌లు త‌లదించుకునేలా చేసింది కేంద్రానికి. ఇదే స‌మ‌యంలో సీజేఐ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం 72 ఏళ్ల ఆనంద్ తెల్తుంబ్డేకు(Anand Teltumbde) బెయిల్ ఇచ్చే విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఎన్ఐఏ బెయిల్ ఇవ్వ‌వ‌ద్దంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది. ఒక ర‌కంగా కొట్టి వేసింది. ఇది రెండోది. ఆనంద్ తెల్తుంబ్డేకు ప్ర‌స్తుతం 71 ఏళ్లు. ఆయ‌న 1950 జూలై 15న పుట్టారు. స్వ‌స్థ‌లం మ‌హారాష్ట్ర లోని రాజూర్ ఊరు.

2020లో ఆనంద్ తెల్తుంబ్డేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని. విచిత్రం ఏమిటంటే ఆయ‌న ఆలోచ‌నాప‌రుడు. ప్రొఫెస‌ర్, ర‌చ‌యిత‌, మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌. బీటెక్ చ‌దివారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు.

ముంబై యూనివ‌ర్శిటీలో పీహెచ్ డి కూడా పూర్త‌యింది. వృత్తి రీత్యా ప్రొఫెస‌ర్ ప్ర‌వృత్తి రీత్యా ర‌చ‌యిత‌గా పేరొందారు. గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేశారు. భార‌త దేశంలోని కుల వ్య‌వ‌స్థ గురించి విస్తృతంగా రాశాడు.

ద‌ళితుల హ‌క్కుల కోసం వాదించాడు. కాగా ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీని(PM Modi) విమ‌ర్శిస్తూ వ‌స్తున్నాడు. ఆపై ఆయ‌న‌పై మోపిన అభియోగాలు త‌ప్ప‌ని పేర్కొంటున్నాయి మాన‌వ హ‌క్కుల సంఘాలు. ర‌చ‌యిత‌లు, మాన‌వ‌తావాదులు. ఆయ‌న‌కు క‌ర్ణాట‌క స్టేట్ ఓపెన్ యూనివ‌ర్శిటీ నుంచి డాక్ట‌రేట్ కూడా ల‌భించింది.

విద్యావేత్త కావ‌డానికి ముందు భార‌త్ పెట్రోలియంలో ఎగ్జిక్యూటివ్ గా , పెట్రోనెట్ ఇండియా లిమిటెడ్ లో ఎండీగా ప‌ని చేశాడు. ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ లో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేశాడు. ఎక‌నామిక్ అండ్ పొలిటిక‌ల్ వీక్లీలో మార్జిన్ స్పీక్ పేరుతో కాలమ్ రాశాడు. ఔట్ లుక్ , తెహెల్కా, సెమినార్ ల‌కు కూడా స‌హ‌కారం అందించాడు.

మార్క్సిజం, అంబేద్క‌రిజం ఉద్య‌మాల గురించి చ‌ర్చించాడు. 29 ఆగ‌స్టు 2018న భీమా కోరేగావ్ హింసాకాండ‌తో సంబంధం ఉంద‌ని , పీఎం మోడీని హ‌త్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర ప‌న్నార‌ని ఆరోపిస్తూ తెల్తుంబ్డే ఇంటిపై పోలీసులు దాడి చేశారు.

దీనిని తెల్తుంబ్డే ఖండించారు. ఫిబ్ర‌వ‌రి 3, 2019న పూణే పోలీసులు అరెస్ట్ చేసి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా డీవై చంద్ర‌చూడ్ పోలీసుల ప‌క్ష‌పాత వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు.

16 మార్చి 2020న ఉపా చ‌ట్టం కింద అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయ‌న‌కు బెయిల్ మంజూరైంది. మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు ఆనంద్ తెల్తుంబ్డే.

Also Read : గ‌వ‌ర్న‌ర్ కు ఫ‌డ్న‌వీస్ భార్య మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!