Centre Clears Funds : బెంగాల్ కు రూ. 8,200 కోట్లు విడుదల
పీఎంఏవై కింద నిధులకు విముక్తి
Centre Clears Funds : దీదీ వర్సెస్ మోదీ నేపథ్యంలో గత కొంత కాలంగా కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రతిసారీ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయడం లేదని వాపోతున్నారు.
దీని వల్ల తమకు అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు. ఈ తరుణంలో కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన రూ. 8,200 కోట్లను విడుదల చేసింది.
అంతే కాకుండా బెంగాల్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్టు కింద పేదల కోసం 11.34 లక్షల ఇళ్లను నిర్మించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ రూ. 13,000 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించింది.
అంతే కాకుండా నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఉపశమనం కలిగించేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర సచివాలయానికి తెలియ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బెంగాల్ నుంచి గతంలో వసూలు చేసిన వస్తు, సేవల పన్నుకి పరిహారంగా రూ. 814 కోట్లు క్లియర్ చేసినట్లు(Centre Clears Funds) వెల్లడించింది.
పథకం పేరు మార్చకుండా , కొత్త లబ్దిదారులను చేర్చకుండా ఉంటే మరికొన్ని నిధులను కూడా మంజూరు చేస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు.
ఇదిలా ఉండగా పీఎంఏవై , ఇతర పథకాల అమలు తీరును కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. పథకాల పేర్లను మార్చిన అన్ని సైన్ బోర్డులకు మళ్లీ రంగులు వేయాలని ఆదేశించింది.
Also Read : అల్లర్లు నేర్పిన గుణపాఠం శాంతికి మార్గం