PM Modi : భార‌త రాజ్యాంగం దేశాన్ని న‌డిపించే సాధ‌నం

అది లేక పోతే పాలించ‌డం క‌ష్ట‌మ‌న్న ప్ర‌ధాని

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కీల‌క ప్ర‌సంగం చేశారు. భార‌త రాజ్యాంగం అన్న‌ది లేక పోతే పాలించ‌డం క‌ష్ట‌మ‌న్నారు. రాజ్యాంగం దేశాన్ని న‌డిపించే సాధ‌న‌మ‌ని చెప్పారు. శ‌నివారం భార‌త రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్బంగా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్రచూడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఈ కోర్టు కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు.

నాలుగు డిజిట‌ల్ కోర్టు కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మోదీ(PM Modi) . రాజ్యాంగ‌మే దేశ ప్ర‌గ‌తిని ముందుకు న‌డిపించే అతి పెద్ద శ‌క్తి అని స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగానికి సంబంధించిన చ‌ర్చ‌ల‌లో యువ‌త పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌త్యేకంగా యువ‌తీ యువ‌కుల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వ సంస్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ‌లు కృషి చేయాల‌ని కోరారు మోదీ. భార‌త దేశం ఒక వారంలో జీ20 అధ్య‌క్ష ప‌ద‌విని పొందుతుంద‌న్నారు.

ఇది దేశానికి సంబంధించినంత వ‌ర‌కు అతి పెద్ద అవ‌కాశ‌మ‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ(PM Modi) . న్యాయ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక‌తను వాడుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. భార‌త రాజ్యాంగాన్ని త‌యారు చేసిన వారంద‌రికీ ఇవాళ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని అన్నారు ప్ర‌ధానమంత్రి.

పెండింగ్ కేసుల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని సూచించారు పీఎం.

Also Read : కోర్టులు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి – సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!