JP Nadda : ఛాన్స్ ఇస్తే 20 ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ – న‌డ్డా

గుజ‌రాత్ లో బీజేపీ మేనిఫెస్టో విడుద‌ల

JP Nadda : రాష్ట్రంలో 27 ఏళ్ల పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీని ఆద‌రించారు. ఇంకా త‌మ ప్రేమ‌ను కురిపిస్తూనే ఉన్నారు. మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. దేశంలోనే ఇప్పుడు గుజ‌రాత్ మోడ‌ల్ అమ‌ల‌వుతోంద‌న్నారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా(JP Nadda). ప్ర‌స్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

డిసెంబ‌ర్ 1, 5వ తేదీల‌లో రెండు విడత‌లుగా శాస‌న‌స‌భ పోలింగ్ జ‌ర‌నుంది. ఇప్ప‌టికే బీజేపీతో పాటు కాంగ్రెస్ , ఆప్ , ఎంఐఎం బ‌రిలో ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ద్విముఖ పోరు ఉండ‌గా ఈసారి నాలుగు స్తంభాలాట‌గా మారింది. శ‌నివారం జేపీ న‌డ్డా ఆధ్వ‌ర్యంలో బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా న‌డ్డా మాట్లాడుతూ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే రాబోయే 5 సంవ‌త్సరాల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. యూనిఫాం సివిల్ కోడ్ ను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేస్తామ‌ని అన్నారు. స‌మాజానికి, రాష్ట్రానికి ఇబ్బంది క‌లిగించే వారి ఆట క‌ట్టిస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇందు కోసం యాంటీ రాడిక‌లైజేష‌న్ సెల్ ను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. గుజ‌రాత్ లో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీని వెంట‌నే స్థాపిస్తామ‌ని చెప్పారు జేపీ న‌డ్డా. రూ . 10 వేల కోట్ల బ‌డ్జెట్ తో 20 వేల ప్ర‌భుత్వ బ‌డులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

వ్య‌వ‌సాయం, మార్కెటింగ్ లో మౌలిక వ‌స‌తుల కోసం రూ. 10 వేల కోట్లు, నీటి పారుద‌ల సౌక‌ర్యాల కోసం రూ. 25 వేల కోట్లు, ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం కింద రూ. 10 ల‌క్ష‌ల విలువైన వైద్య బీమా సదుపాయం క‌ల్పిస్తామ‌న్నారు జేపీ న‌డ్డా(JP Nadda).

Also Read : భార‌త రాజ్యాంగం దేశాన్ని న‌డిపించే సాధ‌నం

Leave A Reply

Your Email Id will not be published!