Arvind Kejriwal : యోగి చిల్లర రాజకీయాలు మానుకో
నిప్పులు చెరిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal : గుజరాత్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. నేతలు మాటల తూటాలు పేల్చడంతో పాలిటిక్స్ వేడెక్కాయి. రాష్ట్రంలో డిసెంబర్ 1, 5న పోలింగ్ జరగనుంది. గత 27 ఏళ్లుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ అధికారంలో కొనసాగుతోంది.
ఈసారి చతుర్ముఖ పోటీ కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్ , బీజేపీ, ఎంఐఎంతో పాటు ఆప్ కూడా బరిలో ఉంది. ఇప్పటికే ఆప్ ముందస్తుగా తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రసంగించారు.
తనను రాజకీయ ఉగ్రవాది అని పేర్కొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై మండిపడ్డారు. మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే బీజేపీ నాయకులకు ఇంత కంటే ఎక్కువ మాటలు రావన్నారు. కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన సంస్కారం రాదని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు అప్పీలు చేశారు కేజ్రీవాల్(Arvind Kejriwal) . మీకు చిల్లర రాజకీయాలు కావాలా లేక చదువు కునేందుకు బడులు, రోగం వస్తే చూయించు కునేందుకు ఆస్పత్రులు వద్దా అని ప్రశ్నించారు. ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి తమ ముందున్న లక్ష్యమన్నారు.
దేశానికే ఢిల్లీ రోల్ మోడల్ గా ఉందన్నారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటి వరకు యూపీలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు యోగిని.
Also Read : జ్యోతిష్యాన్ని కాదు కష్టాన్ని నమ్ముకున్నా