Digvijaya Singh : పాదయాత్రలో పట్టు తప్పిన ‘డిగ్గీ రాజా’
బీజేపీ పాలనలో రోడ్లు అధ్వాన్నం
Digvijaya Singh : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆయన చేపట్టిన యాత్ర తమిళనాడులో ప్రారంభమైంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రలలో ముగిసింది.
ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ తరుణంలో శనివారం రాహుల్ చేపట్టిన పాదయాత్రలో మాజీ సీఎం, కాంగ్రెస్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పట్టు(Digvijaya Singh) తప్పి పడి పోయారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు.
ఇదిలా ఉండగా గతంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అమెరికాలోని వాషింగ్టన్ కంటే అద్భుతంగా మధ్య ప్రదేశ్ లో రోడ్లు బాగున్నాయని చెప్పారు. మరి ఇప్పుడు తమ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పడిపోతే ఏం సమాధానం చెబుతారంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా బర్వాహా సమీపంలో ప్రవేశించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
ఉన్నట్టుండి నడవలేక పట్టు తప్పి పడి పోయారు. ఏ మాత్రం పట్టు జారినా తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవారని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఇదిలా ఉండగా దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) కావాలని పడి పోయారని ఆరోపించింది భారతీయ జనతా పార్టీ. అంతే కాదు కాంగ్రెస్ నేతలే ఆయనను నెట్టి వేశారంటూ మరో కీలక కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సీఎం, మాజీ సీఎంల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
Also Read : యోగి చిల్లర రాజకీయాలు మానుకో