Rahul Gandhi : కాషాయం రాజ్యాంగానికి వ్యతిరేకం – రాహుల్
బీజేపీ..ఆర్ఎస్ఎస్ పై షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ , భజరంగ్ దళ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమని మండిపడ్డారు. కులం, ప్రాంతం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడుతూ రాజకీయంగా ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ఈ యాత్ర గత సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రలలో పాదయాత్ర పూర్తయింది.
ప్రస్తుతం ఎంపీలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యాత్రను ఉద్దేశించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్ర నేత. ఇదిలా ఉండగా బాబా సాహెబ్ జన్మ స్థలం మోవ్ కు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు విచక్షణతో రాజ్యాంగాన్ని ముగించాలని కోరుకుంటున్నాయని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తెలివిగా అంతం చేసే పనిలో పడ్డాయని హెచ్చరించారు. ఈ రాజ్యాంగం ఉండడం వల్లనే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దొరుకుతున్నాయని అన్నారు.
అది కూడా లేకుండా చేస్తే నిరంకుశత్వంతో పాలించాలని ప్రధానమంత్రి నరంద్ర మోదీ ఆలోచిస్తున్నాయని ఆరోపించారు.
Also Read : పాదయాత్రలో పట్టు తప్పిన ‘డిగ్గీ రాజా’