Mahatma Gandhi UNO : ఐక్య‌రాజ్య స‌మితిలో ‘గాంధీ’ విగ్ర‌హం

డిసెం డ‌ర్ 14న ముహూర్తం ఖ‌రారు

Mahatma Gandhi UNO : ప్ర‌పంచాన్ని త‌న శాంతి మంత్రంతో ప్ర‌భావితం చేసిన గుజ‌రాత్ కు చెందిన జాతిపిత మ‌హాత్మా గాంధీకి అరుదైన గౌర‌వం ద‌క్క‌నుంది. ప్ర‌పంచ దేశాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఐక్య రాజ్య స‌మితి ప్రాంగ‌ణంలో మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని(Mahatma Gandhi UNO) ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ అరుదైన కార్య‌క్ర‌మం వ‌చ్చే నెల డిసెంబ‌ర్ లో జ‌ర‌గ‌నుంది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకునేందుకు వీలుగా ఐక్య రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే కొంద‌రిని అక్క‌డ ఏర్పాటు చేశారు. తాజాగా బాపుగా పిలుచుకునే మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ విగ్ర‌హాన్ని విష్క‌రించనున్నారు.

ఇందులో భాగంగా వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 14న ప్ర‌పంచ సంస్థ ప్ర‌ధాన ఆఫీసులో ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే నెల భార‌త దేశానికి కీల‌కం కానుంది. భ‌ద్ర‌తి మండ‌లి అధ్య‌క్షునిగా స్వీక‌రించ‌నుంది భార‌త్. మ‌న దేశం నుంచి కేంద్ర స‌ర్కార్ గాంధీ మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని బ‌హుమ‌తిగా ఐక్య రాజ్య స‌మితికి ఇవ్వ‌నుంది.

అయితే యుఎన్ఓ లో మొట్ట‌మొద‌టి విగ్ర‌హం ఇదే కావ‌డం విశేషం. గుజ‌రాత్ లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించిన ప్ర‌ఖ్యాత భార‌తీయ శిల్పి ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన రామ్ సుతార్ రూపొందించారు దీనిని. ఈ విగ్ర‌హాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ దీనిని యుఎన్ లో ఆవిష్క‌రిస్తారు. ఈ విష‌యాన్ని భార‌త దేశ శాశ్వ‌త ప్ర‌తినిధి రుచిరా కాంబోజ్ వెల్ల‌డించారు.

Also Read : నేనేమీ ‘కిండ‌ర్ గార్డెన్’ లో లేను – శ‌శి థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!