Mahua Moitra : రాం దేవ్ కామెంట్స్ మ‌హూవా సీరియ‌స్

మ‌హిళ‌ల ప‌ట్ల వ్యాఖ్య‌లు దారుణం

Mahua Moitra : ప్ర‌ముఖ యోగా గురు రాం దేవ్ బాబా మ‌హిళ‌ల‌పై చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీశాయి. మ‌హిళ‌లు చీర‌ల్లో అందంగా ఉంటారు. స‌ల్వార్ క‌మీజుల్లో కూడా సూప‌ర్. అయితే బ‌ట్ట‌లు లేకుండా కూడా ఇంకా అద్భుతంగా ఉంటారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన స‌మ‌యంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్ కూడా ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌తంలో కూడా రాం దేవ్ బాబా ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి చివ‌ర‌కు త‌ప్పు ఒప్పుకున్నారు. మ‌న్నించ‌మ‌ని కోరారు. క‌రోనా క‌ష్ట కాలంలో విశిష్ట సేవ‌లు అందించిన వైద్యుల‌పై కూడా నోరు పారేసుకున్నారు.

చివ‌ర‌కు ఐఎంఏ సీరియ‌స్ కావ‌డం, ప్ర‌ధాని దాకా స‌మ‌స్య వెళ్ల‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో రాం దేవ్ బాబా బ‌హిరంగంగా సారీ చెప్పారు. తాజాగా మ‌హారాష్ట్ర లోని పూణే వేదిక‌గా జ‌రిగిన ప‌తంజ‌లి యోగా స‌మావేశంలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంపై పెద్ద ఎత్తున మ‌హిళా సంఘాలు మండిప‌డ్డాయి.

దీంతో రాం దేవ్ బాబా అనుచిత కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మ‌హూవా మొయిత్రా(Mahua Moitra). వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో మ‌హిళ‌ల ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌స్తుతం రాం దేవ్ బాబాను బ్యాన్ చేయాల‌ని, ఆయ‌న అమ్ముతున్న పతంజ‌లి వ‌స్తువుల‌ను , ఉత్ప‌త్తుల‌ను నిలిపి వేయాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : ‘బాబా’ నిర్వాకం మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!