CM KCR : తెలంగాణ రాష్ట్రం అభివృద్దికి సోపానం
సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
CM KCR : రాదనుకున్న తెలంగాణ రానే వచ్చింది. కాదనుకున్న అభివృద్దిని ఆచరణలో చేసి చూపించా. బక్కోడు అని గేలి చేసిండ్రు. పాలన చేత కాదన్న వాళ్లే విస్తు పోయేలా ఆదర్శ ప్రాయంగా మార్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు సీఎం కేసీఆర్(CM KCR). కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కలిసి కట్టుగా పని చేయడం వల్లనే రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతోందన్నారు.
ఆదివారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అన్ని శాఖలు కలిసి ముందుకు సాగితే అభివృద్ది పరుగులు తీస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో పథకాలు అమలు చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా మారిందని అన్నారు సీఎం కేసీఆర్.
స్వరాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ అభిమతమన్నారు. మనం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం ఆదర్శ ప్రాయంగా ఉందన్నారు సీఎం. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, తదితర రంగాలలో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. పరిశ్రమల పరంగా తీసుకు వచ్చిన కొత్త పాలసీ వల్ల కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్(CM KCR).
రానున్న రోజులన్నీ మనకు సవాల్ అన్నారు. ప్రతి ఒక్కరు పని చేస్తారు. కానీ భిన్నంగా, మరింత అర్థవంతంగా, ప్రయోగాత్మకంగా చేయాలని అప్పుడే కొత్త ఆవిష్కరణలు లభిస్తాయని చెప్పారు .
ప్రస్తుతం వ్యవసాయం, సాగు , తాగు నీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం, తదితర ప్రధాన రంగాలలో తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు.
Also Read : పవర్ లోకి వస్తే ఐటీ రైడ్స్ ఉండవు