YS Sharmila Arrest : ప్రగతి భవన్ ముట్టడి..షర్మిల అరెస్ట్
కారులో ఉండగానే లాక్కెళ్లిన పోలీసులు
YS Sharmila Arrest : వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సోమాజిగూడ వద్దకు వెళ్లిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా తన వాహనం, ప్రచార రథం (బస్సు)ను ధ్వంసం చేశారు.
లోటస్ పాండ్ నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధ్వంసమైన కారులోనే ఉన్నారు షర్మిల. టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేసిన బస్సును కూడా ప్రగతి భవన్ వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఖాకీలు అడ్డుకున్నారు. ఆమెను వెళ్లకుండా వాహనాలను నిలిపి ఉంచారు.
ఆమె బయటకు రాకుండా ఉండడంతో రావాలని కోరుతున్నారు పోలీసులు. కానీ పట్టించు కోవడం లేదు వైఎస్ షర్మిల. ఎస్ఆర్ నగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖాకీలు అనుసరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపి బోయింగ్ వెహికిల్ ను అక్కడికి రప్పించారు.
షర్మిల(YS Sharmila Arrest) కారులో ఉండగానే దానిని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెను బలవంతంగా తరలించడంపై వైసీపీ పార్టీ శ్రేణులు, నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. అంతకు ముందు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అయితే వాళ్లకు తెలియకుండా సోమాజీగూడకు చేరుకోవడం విస్తు పోయేలా చేసింది. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బందిపోట్ల సమితి అని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ కు కార్యకర్తల్లా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : అరెస్ట్ చేసినా ఆగం ప్రగతి భవన్ ముట్టడిస్తం