YS Sharmila : దాడులకు భయపడం బరాబర్ ప్రశ్నిస్తం
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షర్మిల
YS Sharmila : తెలంగాణలో రాచరిక పాలన సాగుతోంది. సీఎం కేసీఆర్ దొర ఏది చెబితే అదే నడుస్తోంది. ఊడిగం చేసే వాళ్లకు, అడుగులకు మడుగులు వత్తేవాళ్లకు, నీ బాంచన్ దొర అని కాళ్లు మొక్కే వాళ్లకు అందలం ఎక్కిస్తూ ప్రగతి భవన్ లోనే ఉండి పోయిన కేసీఆర్ ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండేందుకు వీలేదన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila).
ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రను టీఆర్ఎస్ గూండాలు కావాలని అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు తనకు తిరిగి పాదయాత్ర చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ షర్మిల.
విచారణ చేపట్టిన కోర్టు పాదయాత్రకు ఓకే చెప్పింది. అయితే షర్మిలకు(YS Sharmila) కొన్ని కండీషన్స్ పెట్టింది. కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేయవద్దంటూ స్పష్టం చేసింది. విడుదలై తన ఇంటికి వచ్చిన సందర్భంగా వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం లభించింది. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.
ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అది బీఆర్ఎస్ కాదని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఆరోపించారు. ఆ పార్టీలో ఉద్యమకారులు లేరని కేవలం గూండాలు మాత్రమే ఉన్నారంటూ మరోసారి నిప్పులు చెరిగారు. తాను కావాలని వ్యక్తిగత ఆరోపణలు చేయలేదన్నారు. ప్రజలు అడగమంటే ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి గురించి మాట్లాడానని చెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.
Also Read : బీఆర్ఎస్ కాదు బందిపోట్ల రాష్ట్ర సమితి