Madras High Court Ban : తమిళనాడు గుడుల్లో మొబైల్స్ బ్యాన్
మొబైల్స్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి
Madras High Court Ban : తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో మొబైల్ ఫోన్లు వాడకాన్ని నిషేధం విధించింది. ఈ మేరకు ఎవరు కూడా వాడకూడదంటూ(Madras High Court Ban) స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లతో అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పిటిషన్ దాఖలైంది. ఈ దావాకు సంబంధించి విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
ప్రధాన ఆలయాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గుడుల్లో మొబైల్స్(Mobile Phones) వాడకాన్ని బంద్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్నిగుడులతో పాటు ప్రార్థనా స్థలాల్లో కూడా ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది హైకోర్టు ధర్మాసనం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయాలు, ప్రార్థనా స్థలాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడేందుకు గాను మొబైల్స్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది ధర్మాసనం.
ఇందులో భాగంగా సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కూడా కీలక సూచనలు చేసింది. తమిళనాడులోని అన్ని ఆలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
ఇందుకు సంబంధించి ఆలయాలను, ప్రార్థనా స్థలాల నిర్వాహకులు, బాధ్యులు ఎలాంటి ఫీజు లేదా రుసుము వసూలు చేయవద్దంటూ కూడా హెచ్చరించింది కోర్టు. ప్రజలు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇదిలా ఉండగా మద్రాస్తు సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు నిర్ణయం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : శ్రీరాముడినే కాదు సీతను గౌరవించండి