YS Sharmila : అమరులను విస్మరించిన కేసీఆర్ – షర్మిల
1200 మంది ఉసురు తగులుతుంది
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన శ్రీకాంతాచారి వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడారు.
రాష్ట్రం కోసం 1200 మంది బలిదానం చేసుకుంటే కేవలం 500 మందికి మాత్రమే సర్కార్ అరకొర సాయం చేసిందని , మిగతా 700 మందిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అమరులైన వారి త్యాగ ఫలమే నేటి తెలంగాణ రాష్ట్రమని, కానీ వారి పేరు చెప్పుకుని రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ పూర్తిగా నాశనం చేశాడని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే బాగు పడిందని మిగతా వారంతా రోడ్ల పాలయ్యారని మండిపడ్డారు. తండ్రి సీఎం, కొడుకు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, మరొకరు రాజ్యసభ ఎంపీ ఇలా చెప్పుకుంటూ ఒక ఏడాది పడుతుందని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కేసీఆర్ ఇవాళ చిలుక పలుకులు పలుకుతున్నాడని మండిపడ్డారు.
తన కూతురు ఎంపీగా ఓడి పోతే వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన కేసీఆర్ ఓడిపోతుందని తెలిసి శ్రీకాంతాచరి తల్లిని నిలబెట్టారంటూ ధ్వజమెత్తారు. కొడుకేమో ల్యాండ్ బ్యాంక్ , కూతురేమో లిక్కర్ బ్యాంక్ , కేసీఆర్ కాళేశ్వర్ ఏటీఎం బ్యాంక్ అంటూ ఎద్దేవా చేశారు చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila).
18 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పిన కేసీఆర్ 70 వేల కోట్లకు పంగనామం పెట్టాడంటూ ఆరోపించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుతో నింపేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ