Delhi Congress Chief : ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఓటు గల్లంతు
వాపోయిన పార్టీ ప్రెసిడెంట్
Delhi Congress Chief : ఢిల్లీ బల్దియా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. సామాన్యులు బారులు తీరారు ఓట్లు వేసేందుకు. ఈసారి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎం బరిలో ఉన్నాయి. చతుర్ముఖ పోటీ ఉన్నా ప్రధానంగా బీజేపీ వర్సెస్ ఆప్ గా మారి పోయింది.
ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది ఢిల్లీ ఎన్నికల సంఘం. ఇదిలా ఉండగా ఉదయం 7 గంటల నుంచి తిరగాల్సిన మెట్రో రైళ్లను రాష్ట్ర ఆప్ ప్రభుత్వం తెల్లవారజామున 4 గంటల నుంచే ప్రారంభించింది.
ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. స్వచ్ఛ ఢిల్లీ కోసం, మెరుగైన, సమర్థవంతమైన పాలన కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఇదిలా ఉండగా పలువురు ప్రముఖుల పేర్లు ఈసారి పోలింగ్ లో గల్లంతు కావడం విస్తు పోయేలా చేసింది.
తాజాగా తన ఓటు కనిపించడం లేదని , గాయబ్ అయ్యిందంటూ వాపోయారు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనిల్ చౌదరి(Delhi Congress Chief). తాను ఓటు వేసేందుకు బూత్ వద్దకు వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఓటరు జాబితాలో తన పేరు లేక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఆప్ సర్కార్ పనితీరుకు నిదర్శమని ఆరోపించారు.
ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని ఇది సూచిస్తోందని తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఆయన ఓటు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : స్వచ్ఛ ఢిల్లీ కోసం ఓటు వేయండి – కేజ్రీవాల్