Anand Sharma SS Sukhu : సామాన్యుడికి ద‌క్కిన గౌర‌వం

ఆనంద్ శ‌ర్మ సుఖుకు కంగ్రాట్స్

Anand Sharma SS Sukhu : కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎంగా 58 ఏళ్ల సుఖ్విందర్ సింగ్ సుఖును నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆయ‌న పీసీసీ చీఫ్ గా పార్టీని విజ‌య ప‌థంలో న‌డిపించారు. చివ‌రి దాకా ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఉత్కంఠ నడించింది.

ప‌రిశీకులు రాజీవ్ శుక్లా, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బాఘేల్ 40 మంది ఎమ్మెల్యేల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం సుఖు అయితేనే రాష్ట్రాన్ని న‌డిపించ గ‌ల‌ర‌ని హైక‌మాండ్ కు విన్న‌వించారు. ఇదే స‌మ‌యంలో మాజీ సీఎం వీర‌భ‌ద్ర సింగ్ స‌తీమ‌ణి , ఎంపీ ప్ర‌తిభా సింగ్ పెద్ద ఎత్తున పోటీదారుగా నిలిచారు.

కానీ చివ‌ర‌గా తాను కూడా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది సీఎం రేసు నుంచి. ఇదిలా ఉండ‌గా అత్యంత సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చారు సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు. ఆయ‌న తండ్రి ఓ బ‌స్ కండ‌క్ట‌ర్ . చ‌దువు మీద ఉన్న ఇష్టంతో సుఖు(SS Sukhu) పాల వ్యాపారం చేశాడు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజీవ్ గాంధీ హ‌యాం నుంచి ఆయ‌న పార్టీని న‌మ్ముకుని ఉన్నారు. సోనియా త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి పార్టీ చీఫ్ క‌ట్ట‌బెట్టింది. ఈ సంద‌ర్భంగా త‌న చిర‌కాల మిత్రుడైన సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు సీఎం కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు ఆనంద్ శ‌ర్మ‌.

పార్టీ అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌శంసించారు. ఇది కేవ‌లం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. అత్యంత సామాన్య‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన సుఖుకు అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు ఆనంద్ శ‌ర్మ‌(Anand Sharma).

Also Read : మంత్రి పాటిల్ పై సిరాతో దాడి

Leave A Reply

Your Email Id will not be published!