Cristiano Ronaldo : ఫుట్ బాల్ దిగ్గజం రొనాల్డో కన్నీటి పర్యంతం
ఫిఫా వరల్డ్ కప్ -2022 నుండి నిష్క్రమణ
Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో మోస్ట్ పాపులర్ ప్లేయర్. అతడు కోట్లకు పడగలెత్తాడు. కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నాడు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్చుగల్ కు వరల్డ్ కప్ తీసుకు రావాలని అనుకున్నాడు. కానీ అనుకోని రీతిలో క్వార్టర్ ఫైనల్స్ లో ఎలాంటి అంచనాలు లేని మొరాకో జట్టు చేతిలో 1-0 తేడాతో ఓటమి పాలైంది.
దీంతో టైటిల్ ఫేవరేట్ గా ఉన్న పోర్చుగల్ ఫిఫా వరల్డ్ కప్ -2022 నుండి నిష్క్రమించింది. స్టేడియంలోనే కుప్ప కూలాడు రొనాల్డో. ఏడ్చుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం దిగ్గజ ఆటగాడు రొనాల్డో(Cristiano Ronaldo) ఏడ్వడం క్రీడాభిమానులను విస్తు పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
చివరి దాకా చేసిన ప్రయత్నం ఫలించ లేదు పోర్చుగల్ కు. అంతా రొనాల్డో ఉన్నాడని, ఈసారి వరల్డ్ కప్ కైవసం చేసుకోవడం ఖాయమని అనుకున్నారంతా . కానీ మొరాకో ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. అంతే కాదు ఈ మెగా టోర్నీలో ఇతర జట్లకు అరబ్ దేశం మొరాకో చుక్కలు చూపించింది.
అన్ని రంగాలలో రాణించింది ఆ జట్టు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ చరిత్రలో మొరాకో సెమీ ఫైనల్ కు వెళ్లడం. ఏది ఏమైనా మొరాకో కొట్టిన దెబ్బకు పోర్చుగల్ ఆటగాళ్లు షాక్ కు గురయ్యారు. ఆటలో ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేం. అందుకే ఫుట్ బాల్ కు అంత క్రేజీ.
ఇదిలా ఉండగా ఏకంగా 1868 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చింది సౌదీ ఫుట్ బాల్ క్లబ్ రొనాల్డోకు.
Also Read : పోర్చుగల్ కు షాక్ సెమీస్ కు మొరాకో