Rahul Gandhi : వ్య‌వ‌స్థ‌ల నిర్వీర్యం దేశానికి ప్ర‌మాదం

కేంద్ర స‌ర్కార్ తీరుపై రాహుల్ ఆగ్ర‌హం

Rahul Gandhi : ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ పోతే చివ‌ర‌కు దేశం ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా ప్ర‌తి ఒక్క‌రు రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

ఆయ‌న ఏ ఒక్క‌రినీ కాద‌న‌డం లేదు. అంద‌రితో క‌లుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ , మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాలలో ముగిసింది. ప్ర‌స్తుతం రాజ‌స్తాన్ లో కొన‌సాగుతోంది. ఆయ‌న‌తో పాటు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌స్తుండ‌డంతో యాత్ర మ‌రింత జోష్ తో కొన‌సాగుతోంది.

ఓ వైపు చ‌లి తీవ్ర ఇబ్బందికి గురి చేసినా ఎక్క‌డా తగ్గ‌డం లేదు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . కొంత మంది విద్యార్థులు ఆయ‌న‌తో ములాఖ‌త్ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ప‌లు ప్ర‌శ్న‌లు వేశారు. వారు కూడా త‌మ ఆన్స‌ర్స్ ఇచ్చారు. అంద‌రికంటే భిన్నంగా సాగుతోంది భార‌త్ జోడో యాత్ర‌.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏకి పారేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇలా ఎంత కాలం కులం, మ‌తం, వ‌ర్గం, ప్రాంతం పేరుతో రాజ‌కీయాలు చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

మ‌తం మాన‌వ‌త్వాన్ని ప్రేరేపించేలా ఉండాలి కానీ ద్వేషాన్ని పెంపొందించేలా ఉండ కూడ‌ద‌న్నారు రాహుల్ గాంధీ. ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : మంత్రి పాటిల్ పై సిరాతో దాడి

Leave A Reply

Your Email Id will not be published!