M Jagadish Kumar : యోగా..ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌యారిటీ

వెల్ల‌డించిన చైర్ ప‌ర్స‌న్ జ‌గ‌దీశ్ కుమార్

M Jagadish Kumar : యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ఎం జ‌గ‌దీశ్ కుమార్(M Jagadish Kumar) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు యోగాకు అత్యంత ప్ర‌యారిటీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. యోగాతో పాటు ప‌ర్యావ‌ర‌ణం కూడా జ‌త చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. యూజీసీ అండ‌ర్ గ్రాడ్యూయేట్ ల కోసం విలువ జోడించిన కోర్సుల‌ను ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగా నాలుగు సంవ‌త్స‌రాల యుజీ ప్రోగ్రామ్ ల‌కు క‌రికుల‌మ్ , క్రెడిట్ ఫ్రేమ్ వ‌ర్క్ పై యూజీసీ కీల‌క ప‌త్రాన్ని త‌యారు చేసింది. ఎన్ఈపీ 2020లో ఊహించిన విధంగా విద్యార్థులు బ‌హుళ విభాగాల నుండి కోర్సుల‌ను నేర్చుకునేందుకు అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది.

దీని ద్వారా కొత్త‌గా తీసుకు వ‌చ్చే నాలుగు ఏళ్ల పాఠ్య ప్ర‌ణాళిక ఫ్రేమ్ వ‌ర్క్ సంపూర్ణ విద్య‌ను అందిస్తుంద‌ని యూజీసీ చైర్ ప‌ర్స‌న్ ఎం. జ‌గ‌దీశ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. చారిత్రిక దృక్కోణంతో భార‌త దేశాన్ని అర్థం చేసుకోవ‌డం. మొత్తంగా భార‌త దేశ ప‌ర్యావ‌ర‌ణం గురించిన జ్ఞానం , యోగ విద్య‌, ఫిట్ నెస్ , క్రీడ‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

వీటితో పాటు డిజిట‌ల్ లెర్నింగ్ ను కూడా చేర్చామ‌న్నారు. యూజీ విద్యార్థుల కోసం యూజీసీ త‌న కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌లో సూచించిన సాధార‌ణ విలువ జోడించిన కోర్సుల‌లో ఒక‌టిగా పేర్కొన్నారు చైర్ ప‌ర్స‌న్ ఎం. జ‌గ‌దీశ్ కుమార్(M Jagadish Kumar).

ఈ మేర‌కు ఆయా యూనివ‌ర్శిటీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విభిన్న‌మైన కోర్సుల‌ను చేయ‌డం వ‌ల్ల విద్యార్థుల్లో అవ‌గాహ‌న సామ‌ర్థ్యం మ‌రింత పెర‌గే చాన్స్ ఉంద‌న్నారు జ‌గ‌దీశ్ కుమార్.

Also Read : గ్రూప్ – 4 పోస్టుల భ‌ర్తీకి ప‌చ్చ జెండా

Leave A Reply

Your Email Id will not be published!