Jairam Ramesh : ఎన్నిక‌లంటే వ్యాపారం కాదు – జైరాం

భార‌త్ జోడో యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ

Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్(Jairam Ramesh) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌లంటే వ్యాపారం కాద‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. కేంద్రంలో మోదీ వ‌చ్చాక ఎన్నిక‌ల్ని అందాల పోటీగా మార్చేశారంటూ ఎద్దేవా చేశారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారంటూ మండిప‌డ్డారు. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా, అన్ని కులాలు , మ‌తాల‌కు చెందిన వారంతా రాహుల్ గాంధీకి జేజేలు ప‌లుకుతున్నార‌ని అన్నారు. జైరాం ర‌మేష్ మీడియాతో మాట్లాడారు. రాజస్తాన్ లో కొన‌సాగుతున్న యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెప్పారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ , మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో పూర్త‌యింద‌ని వెల్ల‌డించారు జైరాం ర‌మేష్‌. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీలు, సిద్దాంతాలు, మేనిఫెస్టో, గుర్తుల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌న్నారు.

రాజ‌స్తాన్ లో ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ , స‌చిన్ పైలట్ ల మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని పేర్కొన్నారు జైరాం ర‌మేష్‌(Jairam Ramesh). వ్య‌క్తుల కంటే పార్టీ ముఖ్య‌మ‌న్నారు. ముందే తాము సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేమ‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

పార్టీ అన్నాక అభిప్రాయాలు ఉండ‌డం స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు. సీఎంను మార్చే ప్ర‌స‌క్తి లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని అది హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో క‌నిపించింద‌న్నారు. త‌మకు అశోక్ గెహ్లాట్ , స‌చిన్ పైల‌ట్ ముఖ్య‌మ‌న్నారు.

Also Read : మోడీపై కామెంట్స్ రాజా ప‌టేరియా అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!