Owaisi : దేశాన్ని చీకట్లో ఉంచిన కేంద్రం – ఓవైసీ
తవాంగ్ సెక్టార్ లో భారత్, చైనా దళాల ఘర్షణ
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) షాకింగ్ కామెంట్స్ చేశారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలియకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చీకట్లో ఉంచిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఓవైసీ. ఇదిలా ఉండగా భారత్ , చైనా దేశాల దళాల మధ్య డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన దళాలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు తెలియ లేదని, దానిని దాచి ఉంచే ప్రయత్నం చేశారంటూ కేంద్ర సర్కార్ పై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన నివేదికపై తీవ్రంగా స్పందించారు.
ఇది పూర్తిగా ఆందోళన కలిగిస్తోందన్నారు ఓవైసీ(Owaisi) . ఇప్పటికైనా కేంద్రం దాగుడు మూతలు ఆడటం మానుకోవాలని, వాస్తవం ఏం జరుగుతుందో దేశానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సరైన సమయంలో యుద్ద ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావన్నారు ఓవైసీ.
అయితే డిసెంబర్ 9న జరిగినా ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెలియ చేయలేదని ప్రశ్నించారు. మీడియాలో వస్తే కానీ తాము తెలుసుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా మోదీ సర్కార్ బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ ఓవైసీ. ఇరు వైపులా గాయాలు అయినా చెప్పక పోవడం బాధాకరమన్నారు.
సరిహద్దు వివాదానికి సంబంధించిన అంశంపై పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇస్తానని స్పష్టం చేశారు ఓవైసీ.
Also Read : ఎన్నికలంటే వ్యాపారం కాదు – జైరాం