India China Border Row : స‌రిహ‌ద్దు వివాదం ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం

కేంద్ర స‌ర్కార్ చేతకానిత‌నం వ‌ల్లే ఘ‌ర్ష‌ణ

India China Border Row : భార‌త, చైనా దేశాల మ‌ధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దు(India China Border Row) వ‌ద్ద డిసెంబ‌ర్ 9న ఇరు దేశాల ద‌ళాలు ఘ‌ర్ష‌ణ ప‌డ్డాయి. అయితే మీడియా ద్వారానే స‌మ‌చారం అందింది.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించిన సీరియ‌స్ అంశాన్ని ప్ర‌క‌టించ‌క పోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి ప్ర‌తిప‌క్షాలు. పార్ల‌మెంట్ లో దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే కేంద్రం ఎప్పుడూ ఎలాంటి చ‌ర్చ‌ల‌కు వెనుకాడ లేద‌ని, వాస్త‌వాల‌తో సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇందుకు సంబంధించి ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో వాయిదా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదిలా ఉండ‌గా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ (ఎల్ఏసీ) వెంట భార‌త్, చైనా సైనికుల మ‌ధ్య తాజాగా ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది.

ఇరువురికి గాయాలైన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్ 9న చోటు చేసుకుంది. ఇరు ప‌క్షాలు వెంట‌నే దాడుల నుంచి విర‌మించుకున్న‌ట్లు భార‌త ఆర్మీ వెల్ల‌డించింది.

విష‌యం తెలిసిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ అంశంపై పార్ల‌మెంట్ లో చ‌ర్చించ‌డం ద్వారా ప్ర‌భుత్వం దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సిన వస‌రం ఉంద‌ని పేర్కొంది. మ‌రో వైపు ఈ అంశంపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని కోరుతూ టీఎంసీ రాజ్య‌స‌భ‌లో నోటీసు ఇచ్చింది.

ఇక కాంగ్రెస్ నేత‌లు మ‌నీష్ తివార‌, స‌య్య‌ద్ న‌సీర్ హుస్సేన్ వ‌రుస‌గా లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో స‌రిహ‌ద్దు లో చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కోరారు. ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా, ఆర్జేడీ ఎంపీ మ‌నోజ్ ఝా కూడా చ‌ర్చించాల‌ని ప‌ట్టు ప‌ట్టారు. ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ లోక్ స‌భ‌లో వాయిదా తీర్మానం ప్ర‌వేశ పెట్టారు.

Also Read : దేశాన్ని చీక‌ట్లో ఉంచిన కేంద్రం – ఓవైసీ

Leave A Reply

Your Email Id will not be published!