Nitish Kumar Tejaswi : తేజస్విపై నితీశ్ కుమార్ కీలక కామెంట్స్
అతడికి మంచి భవిష్యత్తుందని వెల్లడి
Nitish Kumar Tejaswi : బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు భారతీయ ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రోజూ సీఎంను, ఆయన సంకీర్ణ సర్కార్ ను ఏకి పారేస్తున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ సీటును కోల్పోయింది.
ఈ తరుణంలో సీఎం డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాబోయే రోజుల్లో అతడికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రస్తుతం సీఎం చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తన రాజకీయ వారసుడిగా ఎవరు ఉంటారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోందని , దీనిపై తాను వ్యాఖ్యానించ దల్చు కోలేదని పేర్కొన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar).
అయితే రాబోయే రోజుల్లో ఆర్జేడీ చీఫ్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న తేజస్వి యాదవ్ కు ఆ రకమైన సత్తా ఉందని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం. ఇదిలా ఉండగా గతంలో సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన పాత్రను పోషించారు తేజస్వి యాదవ్.
ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మారిన రాజకీయ సమీకరణాల్లో ఆర్జేడీ , జేడీయూ, కాంగ్రెస్ కలిసి బీహార్ లో మహాఘట్ బంధన్ పేరుతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు. మొత్తంగా తన తర్వాత ఎవరు అనే దానిపై తేజస్వి పేరు ఎత్తకుండానే చెప్పకనే చెప్పడం పార్టీ వర్గాలలో ఆసక్తిని అంతకంటే తీవ్రమైన చర్చకు దారితీసింది.
తేజస్వి యాదవ్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు తాను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నానని అన్నారు నితీశ్ కుమార్. తాము గాంధీ మార్గంలో ప్రయాణం చేస్తున్నామని చెప్పారు సీఎం.
Also Read : సరిహద్దు ఉద్రిక్తం రాజ్ నాథ్ సమావేశం