Amit Shah Modi : మోడీ ఉన్నంత వ‌ర‌కు ట‌చ్ చేయ‌లేరు

సెంటు భూమిని స్వాధీనం చేసుకోలేరు

Amit Shah Modi : దేశంలో మోడీ ఉన్నంత వ‌ర‌కు, తమ స‌ర్కార్ ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించినంత కాలం ప్ర‌పంచంలో ఏ శ‌క్తి భార‌త్ ను ఆప‌లేదన్నారు. అలాగ‌ని తాము చేతులు ముడుచుకుని కూర్చున్నామ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని పేర్కొన్నారు. మోడీ, బీజేపీ ప్ర‌భుత్వం ఉన్నంత కాలం సెంటు భూమిని ఎవ‌రూ తీసుకోలేరని హెచ్చ‌రించారు.

అఖండ భార‌తావ‌ని మొత్తం మోడీకి(PM Modi)  జై కొడుతోంద‌ని, చైనా కాదు క‌దా ఇంకే దేశం వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు అమిత్ షా. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ లో భార‌త్, చైనా దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం చోటు చేసుకోవ‌డంపై చ‌ర్చ జ‌రిగింది.

ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కాంగ్రెస్ తో పాటు విప‌క్షాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ప‌ట్ల అభ్యంత‌రం తెలిపారు. ఇదే స‌మ‌యంలో డిసెంబ‌ర్ 9న ఘ‌ట‌న జ‌రిగితే ఇంత వ‌ర‌కు ఎందుకు జాతికి చెప్ప‌లేదంటూ ప్ర‌శ్నించారు ఆయా పార్టీల‌కు చెందిన స‌భ్యులు. ఓవైసీ అయితే దేశాన్ని చీక‌ట్లోకి నెట్టి వేశారంటూ కామెంట్స్ చేశారు. ఆపై మోదీ స‌ర్కార్ బాధ్య‌తా రాహిత్యం గురించి ప్ర‌శ్నించారు.

ఓ వైపు దేశం ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో సంబంధిత కీల‌క స‌మాచారం గురించి ప్ర‌భుత్వం ఎందుకు దాచి పెట్టింద‌టూ నిల‌దీశారు ఓవైసీ. ఇది పూర్తిగా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం త‌ప్ప ఇంకోటి కాద‌న్నారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు అమిత్ షా(Amit Shah).  తాము ప్ర‌తిసారి పాకిస్తాన్ కు, దానిని ప్రోత్స‌హిస్తున్న చైనాకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తూనే వ‌చ్చామ‌ని చెప్పారు.

వాస్త‌వాధీన రేఖ వెంట (ఎల్ఏసీ) భార‌త దేశానికి చెందిన ద‌ళాలు గ‌స్తీ తిరుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చ‌స్త్రశారు అమిత్ షా.

Also Read : కాంగ్రెస్ అంత‌రాయం అమిత్ షా ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!