Justice Bela Trivedi : ‘బానో’ కేసు నుంచి వైదొలిగిన జస్టిస్ త్రివేది
కేసు విచారణ వాయిదా..కొత్త బెంచ్ ఏర్పాటు
Justice Bela Trivedi : బిల్కిస్ బానో కేసు విచారణ నుంచి జస్టిస్ బేలా త్రివేది(Justice Bela Trivedi) తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. దీనిని కొత్త బెంచ్ విచారణ చేపట్టనుంది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.
ఇదిలా ఉండగా తన కుటుంబంలోని ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన 2002 కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కలిగిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవిత ఖైదు పడిన వారంతా దర్జాగా బయటకు వచ్చారు.
దీంతో బాధితురాలైన బిల్కిస్ బానో వారి నుంచి తనకు రక్షణ ఉండదని, ఇది పూర్తిగా అన్యాయమని కోర్టును ఆశ్రయించింది. వారిని విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కాగా అనూహ్యంగా ధర్మాసనం నుంచి బేలా త్రివేది తప్పుకోవడం విస్తు పోయేలా చేసింది.
దీంతో కేసు వాయిదా పడింది. తిరిగి కొత్త బెంచ్ జాబితా చేయాల్సి ఉంటుంది. కాగా న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన వెంటనే జస్టస్ రస్తోగి తన సోదరి ఈ కేసును విచారించేందుకు ఇష్ట పడటం లేదని స్పష్టం చేశారు.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసును వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది(Justice Bela Trivedi) తిరస్కరణకు కారణాన్ని ధర్మాసనం స్పష్టం చేయలేదు. ఎందుకని ఆమె విచారణ నుంచి తప్పుకున్నారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Also Read : అవగాహన లోపం అనారోగ్యానికి కారణం