YS Sharmila : ఖాకీల దౌర్జ‌న్యం ష‌ర్మిల ఆగ్ర‌హం

కావాల‌ని అడ్డుకుంటున్నార‌ని ఫైర్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా త‌మ వారిపై దాడి చేసిన వారిని ఎలా వ‌దిలి వేశారంటూ ప్ర‌శ్నించారు. ఓ వైపు త‌న ఇంటి ముందు బారికేడ్లు తొల‌గించాల‌ని రాష్ట్ర న్యాయ‌స్థానం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింద‌ని చెప్పారు.

తాను చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు కోర్టు ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌ని కానీ ప్ర‌భుత్వ‌మే కావాల‌ని అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు. త‌న‌కు రోజు రోజుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి త‌ట్టుకోలేక ఇలా చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఖాకీలు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపంచారు వైఎస్ ష‌ర్మిల‌.

యాత్ర‌కు హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు ఇంత వ‌ర‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన‌కు న్యాయం కావాల‌ని కోరుతూ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తే కావాల‌ని భ‌గ్నం చేశార‌ని మండిప‌డ్డారు. పార్టీ ఆఫీసును చుట్టు ముట్టార‌ని , క‌ర్ఫ్యూ విధించార‌ని ఆవేద‌న చెందారు. అస‌లు ఈ రాష్ట్రంలో ఎమ‌ర్జెన్సీ ఏమైనా విధించారా అని ప్ర‌శ్నించారు.

పార్టీకి చెందిన నాయ‌కుల‌ను అరెస్ట్ చేశార‌ని, తీవ్రంగా కొట్టారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదంతా అధికారంలో ఉన్న పార్టీ చేయిస్తోందంటూ ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌. ఎలాంటి నోటీసు ఇవ్వ‌కుండా హౌస్ అరెస్ట్ చేశార‌ని ఫైర్ అయ్యారు. రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న పోలీసుల‌పై కేసు వేస్తామ‌న్నారు.

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ, ప్ర‌తి పార్టీకి త‌మ గొంతు వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Also Read : బీఆర్ఎస్ వైర‌స్ బీజేపీ వ్యాక్సిన్ – బండి

Leave A Reply

Your Email Id will not be published!