IND vs BAN 1st Test 2022 : ఆదుకున్న పుజారా..అయ్య‌ర్

ఆట ముగిసే స‌మ‌యానికి 278 ర‌న్స్

IND vs BAN 1st Test 2022 : బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా ఇప్ప‌టికే 1-2 తేడాతో వ‌న్డే సీరీస్ పోగొట్టుకున్న భార‌త్ రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ కు సిద్ద‌మైంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మకు గాయం కావ‌డంతో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ తొలి టెస్టుకు వ్య‌వ‌హరిస్తున్నాడు. మొద‌ట టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఈ స‌మ‌యంలో పుజారా, పంత్ క‌లిసి ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. 46 ర‌న్స్ ఉండ‌గా పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ , ఛ‌తేశ్వ‌ర్ పుజారాకు తోడుగా నిలిచాడు. ఇద్ద‌రూ క‌లిసి ప‌రుగులు సాధించ‌డంపై ఫోక‌స్ పెట్టారు.

మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు(IND vs BAN 1st Test 2022) 6 వికెట్లు కోల్పోయి 278 ప‌రుగులు చేసింది. ఇక సెంచ‌రీకి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన పుజారా 10 ప‌రుగుల దూరంలో ఉండ‌గా 90 ర‌న్స్ వ‌ద్ద క్లీన్ బౌల్డ్ అయి పెవిలియ‌న్ చేరాడు. మ‌రో వైపు ధాటిగా ఆడుతూ వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ 82 ప‌రుగులు చేశాడు.

బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో తైజులు ఇస్లామ్ 3 వికెట్లు తీస్తే మెహిదీ హ‌స‌న్ మిరాజ్ 2 వికెట్లు , ఖ‌లిద్ అహ్మ‌ద్ ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉండ‌గా ఛ‌తేశ్వ‌ర్ పుజారా సెంచరీ చేసి నాలుగు సంవ‌త్స‌రాలైంది. ఈసారి అయినా శ‌త‌కం చేస్తాడ‌ని ఆశించారు ఫ్యాన్స్ . కానీ అన‌వ‌స‌ర షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేసి ఔట్ అయ్యాడు.

మొత్తం 203 బంతులు ఎదుర్కొని 90 ర‌న్స్ చేయ‌డం విశేషం. ఇక మ‌రోసారి సంజూ శాంస‌న్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు బీసీసీఐ.

Also Read : ఫుట్ బాల్ కు లియోనెల్ మెస్సీ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!