TS Govt Jobs : నీటి పారుదల శాఖలో జాబ్స్ కు ఓకే
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : ఓ వైపు ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులను శాంత పరిచేందుకు శర వేగంగా నోటిఫికేషన్లు ప్రకటిస్తూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఇంత వరకు ఎవరికీ నియామక పత్రం ఇచ్చిన దాఖలాలు లేవు.
దీంతో నిరుద్యోగులు పోస్టుల భర్తీపై ఆశలు వదులుకున్నారు. ఒక వేళ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాల భర్తీ తాత్కాలికంగా ఆగి పోతుంది. మరో వైపు ప్రభుత్వం అనుసరిస్తున్న ముందస్తు వ్యూహంలో భాగంగానే హైకోర్టులో కొందరు కేసులు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) కోసం జిల్లాల వారీగా స్కిల్డ్ పోస్టులను భర్తీ(TS Govt Jobs) చేసేందుకు సర్కార్ ఓకే చెప్పింది. మొత్తం 879 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వర్క్ ఇన్స్ పెక్టర్ పోస్టులు 532 , ఎలక్ట్రీషియన్ 109, ఫిట్టర్ 50, ఆపరేటర్స్ 167, ల్యాబ్ అటెండెంట్ 10, వైర్ లెస్ ఆపరేటర్ పోస్టులు 11 ఉన్నాయి.
ఇక అన్ని కేటగరీల పోస్టులు కలిపి కొత్త గూడెం జిల్లాకు 37, ఆదిలాబాద్ కు 10, జగిత్యాలకు 36, జనగామకు 24, జయశంకర్ భూపాల పల్లికి 26 కేటాయించారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాకు 21, కామారెడ్డికి 24, కరీంనగర్ కు 32, ఖమ్మంకు 39, కుమ్రం భీం ఆసిఫాబాద్ కు 22 , మహబూబాబాద్ కు 23 పోస్టులు ఉన్నాయి.
మహబూబ్ నగర్ జిల్లాకు 21, మంచిర్యాలకు 24, మెదక్ కు 17, ములుగుకు 12, నాగర్ కర్నూల్ కు 21, నల్లగొండకు 64, నారాయణపేట కు 23, నిర్మల్ కు 20 ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాకు 40, పెద్దపల్లికి 50 , రాజన్న సిరిసిల్లకు 23,, రంగారెడ్డికి 27, సంగారెడ్డికి 25, సిద్దిపేటకు 49, సూర్యాపేటకు 27, వనపర్తికి 16, వికారాబాద్ కు 26, వరంగల్ అర్బన్ కు 13, వరంగల్ కు 30, యాదాద్రి భువనగిరి జిల్లాకు 33, మేడ్చల్ మల్కాజిరికి ఒక పోస్టు మంజూరు చేశారు.
Also Read : గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి పచ్చ జెండా