Mehbooba Mufti Modi : మోదీ మౌనం దేనికి సంకేతం – ముఫ్తీ
చైనా దాడి చేస్తుంటే ఏం చేస్తున్నట్టు
Mehbooba Mufti Modi : పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు చైనా దూసుకు వస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఆయనకు ప్రచారంపై ఉన్నంత శ్రద్ద దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సరిహద్దు వద్ద ఇండియా, చైనా దేశాల సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని అయినా మోదీ నోరు మెదపక పోవడం దారుణమన్నారు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti). ఇంత జరుగుతున్నా పార్లమెంట్ లో విపక్షాలు వాయిదా తీర్మానం ప్రవేశ పెడితే అనుమతి ఇవ్వక పోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు పీడీపీ చీఫ్. చైనా భారత దేశానికి చెందిన భూభాగాలను అక్రమంగా, దౌర్జన్య పూరితంగా ఆక్రమిస్తూ పోతే ఏం చేస్తున్నారని , నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు. నిత్యం హిందూ మతం పేరుతో రాజకీయం చేసే కేంద్ర సర్కార్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti).
డిసెంబర్ 9న ఇరు దేశాల సైనికులు గాయపడినా ఎందుకు భారత ప్రభుత్వం, ఆర్మీ ప్రకటించ లేదని మండిపడ్డారు పీడీపీ చీఫ్. చైనా జవాన్లు మన వారిపై దాడికి దిగినా ఎందుకని మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా జాతీయ వాదం అంటే అని నిలదీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.
కాశ్మీర్ పౌరులను కేంద్ర సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మదని ఆరోపించారు. యూనిక్ ఐడీలు క్రియేట్ చేసి వారిపై నిఘా పెంచేందుకు ప్లాన్ చేస్తోందంటూ మెహబూబా ముఫ్తీ ధ్వజమెత్తారు.
Also Read : చర్చించేందుకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా