No Concessions : వృద్దుల‌కు రాయితీలు ఇవ్వ‌లేం

ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి

No Concessions : కేంద్రంలో కొలువు తీరిన మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం రోజు రోజుకు సామాజిక బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అమ్మ‌కానికి పెట్టిన కేంద్రం తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ సాక్షిగా వృద్దుల‌కు రైల్వే శాఖ ఆధ్వ‌ర్యంలో ఇస్తున్న రాయితీల‌ను ఇక నుంచి ఇవ్వ‌లేమంటూ(No Concessions) ప్ర‌క‌టించింది.

సబ్సిడీ ఇవ్వ‌డం వ‌ల్ల ప్ర‌తి ఏటా రూ. 59 వేల కోట్ల భారం స‌ర్కార్ పై ప‌డుతోంద‌ని అందుకని ఆ భారాన్ని ఇక నుంచి మోసేందుకు సిద్దంగా లేమ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్. ల‌క్ష‌లాది మంది వృద్దుల‌ను దృష్టిలో పెట్టుకుని గ‌తంలో కాంగ్రెస్ హ‌యాంలో టికెట్ల‌లో రాయితీలు ఇచ్చే వారు.

కానీ దానికి కూడా చెక్ పెట్టింది మోదీ ప్ర‌భుత్వం. ఇదే స‌మ‌యంలో దేశంలోన ప్ర‌ధాన బ్యాంకుల‌లో రుణాలు తీసుకుని చెల్లించ‌కుండా ఉన్న కార్పొరేట్ల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు ఏకంగా రూ. 10 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌ను రైటాఫ్ (మాఫీ) చేసింది. అంతే కాదు కేవ‌లం రాయితీల కార‌ణంగా రూ. 1.84 ల‌క్ష‌ల కోట్లు వారికి ల‌బ్ది చేకూర్చేలా చేసింది కేంద్ర స‌ర్కార్.

వృద్దుల రాయితీకి సంబంధించి ఎప్పుడు పున‌రుద్ద‌రిస్తారంటూ మ‌హారాష్ట్ర‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి, ఎంపీ న‌వ‌నీత్ రాణా ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం చెబుతూ కేంద్ర మంత్రి తాము ఇక నుంచి రాయితీ ఇవ్వలేమంటూ చిలుక ప‌లుకులు ప‌లికారు. దీనిపై వృద్దులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : రైల్వేస్ ఆహారంపై 6 వేల ఫిర్యాదులు

Leave A Reply

Your Email Id will not be published!