CM SS Sukhu : పైరవీలు అబద్దం పనితీరుకు పట్టం – సీఎం
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు
CM SS Sukhu : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన సుఖ్విందర్ సింగ్ సుఖు(CM SS Sukhu) షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై కొందరు ఎమ్మెల్యేలు లాబీయింగ్ (పైరవీలు) చేస్తున్నారని వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు సీఎం. కొత్తగా ఎన్నికయ్యాక న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులతో భేటీ కానున్నారు. ప్రస్తుతానికి సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే కొలువు తీరారు. ఇంకా కేబినెట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 25 సీట్లు పొందగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం 43కి చేరింది. ఇదలా ఉండగా కొత్తగా రూపొందించే కేబినెట్ లో ఎవరు ఉంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు.
ఆయన కూడా లిస్టుపై ఫోకస్ పెట్టనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్న తానై ముందుండి నడిపించారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దీంతో సీఎం , డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే కేబినెట్ లో కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం.
పైరవీలను ప్రోత్సహించే ప్రసక్తి లేదని, పనితీరు ఆధారంగానే కేబినెట్ లో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు సుఖ్విందర్ సింగ్ సుఖు.
Also Read : చైనా కళ్లద్దాలతో చూస్తే దేశం కనిపించదు