MM Naravane : భారత్ సత్తా ఏమిటో చైనాకు తెలుసు
మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే
MM Naravane : అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి సంబంధించి సైనిక బలగం ఏమిటో, దాని శక్తి ఏమిటో చైనాకు తెలుసన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కానీ చైనా కావాలని కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. దానికి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. దేనికైనా సమయం రావాలన్నారు. ఇప్పటికే ఒకసారి తమ చేతిలో చైనాకు గుణపాఠం చెప్పామన్నారు. దేశాల మధ్య సామరస్యత ఉండాలనే ఒకే ఒక్క ఒప్పందం మేరకు మాత్రమే భారత్ మౌనం వహిస్తోందన్నారు.
ఒకవేళ కావాలని అనుకుంటే చైనాను మట్టి కరిపించడం ఓ లెక్కే కాదన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక దేశాలలో భారత్ ఒకటి అని స్పష్టం చేశారు ఎంఎం నరవాణే(MM Naravane) . చైనా సైన్యం క్లబ్ లు, ముళ్ల తీగలను ఉపయోగించడం ద్వారా చరిత్ర పూర్వ కాలం స్థాయికి దిగజారిందని మండిపడ్డారు.
కొట్లాట లేదా యుద్దంలో భారత సైన్యం అటువంటి హాస్యాస్పదమైన వ్యూహాలను ఆశ్రయించడం కంటే కాల్పులు జరుపుతుందని హెచ్చరించారు ఎంఎం నరవాణే. ఒక వైపు తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటే మరో వైపు ముళ్ల తీగలతో చైనా సైనికులు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ ఆర్మీ చీఫ్.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు తమను ఏ విధంగా లక్ష్యంగా చేసుకున్నాయో అదే రీతిలో భారత సైనికులు ఎదురు దాడి చేశారని అన్నారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
Also Read : పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన జై శంకర్