Kerala Governor : కేర‌ళ స‌ర్కార్ తీర్మానం చెల్ల‌దు – గ‌వ‌ర్న‌ర్

ఫుల్ ప‌వ‌ర్స్ నాకే ఉంటాయ‌ని కామెంట్

Kerala Governor : కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ కు మ‌ధ్య యుద్దం కొన‌సాగుతోంది. అది తారా స్థాయికి చేరుకుంది. సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ , గ‌వ‌ర్న‌ర్ ఖాన్ కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రింత ముదిరింది. ఇటీవ‌ల అసెంబ్లీలో యూనివ‌ర్శిటీల‌కు ఛాన్స‌లెర్ గా గ‌వ‌ర్న‌ర్ చెల్లుబాటు కాదంటూ ఏకంగా తీర్మానం చేశారు.

చివ‌ర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పాస్ చేసిన బిల్లును పంపించే ప్ర‌య‌త్నంలో ఉంది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు గ‌వ‌ర్నర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్(Kerala Governor). శుక్ర‌వారం ఆయ‌న మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు క్లియ‌ర్ గా క్లారిటీ ఇచ్చారు. అది పూర్తిగా చ‌ట్ట విరుద్దం అని పేర్కొన్నారు.

అస‌లు ప్ర‌భుత్వానికి రాజ్యాంగం, దాని ప‌రిమితులు, ప‌రిధి తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స‌ర్కార్ కు ఎన్ని హక్కులు ఉంటాయో గ‌వ‌ర్న‌ర్ గా త‌న‌కు అన్ని ప‌వ‌ర్స్ ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. ఆ బిల్లు చ‌ట్ట‌బ‌ద్ద‌మైన‌దా కాదా అని ముందుగా స‌ర్కార్ ఆలోచించాల‌ని సూచించారు.

త‌న‌కు ఎవ‌రి ప‌ట్ల కోపం కానీ ద్వేషం కానీ లేద‌న్నారు. మొత్తంగా తాను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌గ్గేది లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ లో గ‌వ‌ర్న‌ర్ కు ఉన్న అధికారాలకు చెక్ పెట్టింది టీఎంసీ చీఫ్‌, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు.

త‌మ‌కు గ‌వ‌ర్న‌ర్ అక్క‌ర్లేద‌ని సీఎం ఛాన్స‌ల‌ర్ గా ఉంటార‌ని స్ప‌ష్టం చేసింది. ఈ త‌రుణంలో గ‌వ‌ర్న‌ర్ , సీఎంల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే దానిపై ఉత్కం నెల‌కొంది.

Also Read : గాయ‌ప‌డిన ఎంపీ శ‌శి థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!