N Chandrababu Naidu : హైద‌రాబాద్ టెక్ హ‌బ్ నా పుణ్య‌మే

నా వ‌ల్లే ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు

N Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌ర్ కోల్పోయినా హైద‌రాబాద్ పై త‌న ప్రేమ‌ను కోల్పోలేదు. త‌న వ‌ల్ల‌నే హైద‌రాబాద్ కు పేరొచ్చింద‌న్నారు. తాను ఎంతో ముందు చూపుతో ఆలోచించి విజ‌న్ 2020 తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు.

ఆరోజు తాను విజ‌న్ గురించి మాట్లాడితే వెకిలిగా న‌వ్వారని కానీ ఇవాళ హైద‌రాబాద్ ప్ర‌పంచంలోనే టాప్ న‌గ‌రంలో ఒకటిగా ఉంద‌న్నారు. ఇదంతా నా వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను విమ‌ర్శించిన వాళ్లు, వెకిలిగా మాట్లాడిన వాళ్లంతా ఇప్పుడు హైద‌రాబాద్ గొప్ప‌త‌నం గురించి విస్తు పోతున్నార‌ని పేర్కొన్నారు.

తాను విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోన‌ని అన్నారు. అభివృద్ది, టెక్నాల‌జీ ఎక్క‌డ ఉన్నా తాను స్వీక‌రిస్తాన‌ని, నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు(N Chandrababu Naidu). త‌న విజ‌న్ వ‌ల్ల‌నే ఇవాళ ఎన్నో ఐటీ కంపెనీల‌కు హైద‌రాబాద్ కేంద్రంగా మారింద‌న్నారు.

తాజాగా 2029తో ముందుకు వెళుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లోని ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ (ఐఎస్బీ)లో జ‌రిగిన 20 సంవ‌త్స‌రాల వ‌సంతోత్స‌వంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగించారు. అయితే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం విడి పోయింది..కానీ నా రికార్డును ఎవ‌రూ మార్చ లేర‌న్నారు.

త‌న‌ను ఇక గుర్తు ప‌ట్ట‌క పోయినా తాను ఏమీ అనుకోన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆనాడు బిలి గేట్స్ తో తొలిసారి ఎలా క‌లుసుకున్నాన‌నో గుర్తు చేసుకున్నారు. కేవ‌లం 10 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చారు. కానీ నేను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చాక ఆస‌క్తిగా విన్నారు.

45 నిమిషాల పాటు సాగింద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. మైక్రోసాఫ్ట్ ను పెట్ట‌మ‌ని కోరాను. మొద‌ట కాద‌న్నారు. త‌ర్వాత ఏర్పాటు చేశార‌ని ఇదంతా నా వ‌ల్లే జ‌రిగింద‌న్నారు.

Also Read : ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!