Congress Seniors : సీనియర్ల ధిక్కారం రేవంత్ పై ఆగ్రహం
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు
Congress Seniors : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కథ తెలంగాణలో మళ్లీ మొదటి కొచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు(Congress Seniors). ప్రత్యేకించి ఎలాంటి వివాదాస్పద జోలికి వెళ్లని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ్మ సైతం నోరు విప్పడం చర్చకు దారి తీసింది.
శనివారం ఊహించని రీతిలో తాజాగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, కమిటీల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ నాయకులు. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో దామోదర రాజనరసింహ్మ, మధుయాష్కి గౌడ్ , ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా వారంతా మీడియాతో మాట్లాడారు. తమదే ఒరిజనల్ కాంగ్రెస్ అని ప్రకటించారు. మొత్తం 108 మందితో జాబితా ప్రకటిస్తే అందులో టీడీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన 58 మందికి చోటు కల్పించారంటూ మండిపడ్డారు. అంతే కాదు తమను కోవర్టులుగా చిత్రీకరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
తీన్మార్ మల్లన్న పై కూడా సీరియస్ అయ్యారు. తాము ఎలా పార్టీకి నష్టం చేస్తున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని ఛానళ్లు కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇక వలస వచ్చిన వారికి ఒరిజనల్ కాంగ్రెస్ నాయకులకు మధ్య అసలైన పోటీ నెలకొందన్నారు.
పూర్తిగా పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకు వెళతామన్నారు.
Also Read : పార్టీలో పుట్టినం కాంగ్రెస్ కోసం చస్తం